బాలీవుడ్‌కు వెంకీ మామ.. అంతా రెడీ?
వెంకటేష్ గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం వెంకీ మామ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్సయిపోయింది అంటూ టాక్ వినిపిస్తోంది. అది కూడా బాలీవుడ్ బాద్ షా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ద్వారా వెంకీ మామ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అయితే కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా చేయడానికి సిద్ధమైపోతుంటాడు వెంకటేష్. ఈ క్రమంలోనే అటు సల్మాన్ ఖాన్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట.
ప్రస్తుతం కండల వీరుడు సల్మాన్ ఖాన్ కభీ కభీ దీవాలి అనే సినిమాలో నటిస్తుండగా.. ఇదే సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ సినిమా ఆగిపోయింది అని అభిమానులు అనుకుంటున్న సమయంలో సినిమా షూటింగ్ జరుగుతోంది అంటూ నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అభిమానులందరిలో మళ్లీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో వెంకీ మామ నటించబోతున్నాడని విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.