అయ్యో పాపం: ఈసారి కూడా హీరో విశాల్ కు నిరాశే..!!

Divya
గత నెల నుంచి ఎక్కువగా టాలీవుడ్ లో బాక్సాఫీస్ జోరు బాగానే కొనసాగుతోంది.. కొత్త కొత్త సినిమాలతో సంక్రాంతి పండుగకు సినిమాలు విడుదలై సందడి చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఏ సినిమా కూడా విడుదల కాలేదు. దీంతో రిలీజ్ సినిమాలు మరింత తగ్గిపోయాయని చెప్పవచ్చు. విడుదలైన సినిమాలు కూడా ఏమాత్రం ప్రేక్షకులను ఆకర్షించే లేకపోతున్నాయి. ఇక జనవరి నెలలో చివరి వారంలో వచ్చిన గుడ్ లక్ సఖి మూవీ కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక ఫ్లాప్ దిశగా అడుగులు వేసింది.

ఇంకా కొన్ని విడుదల కావాల్సిన సినిమాలు కూడా ప్రతిరోజు పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి. దీంతో బడా సినిమాలు ఏవి విడుదల కావడం లేదు. ఇక ఇదే మంచి తరుణం అనుకోని హీరో విశాల్ తెరకెక్కించిన సామాన్యుడు మూవీని థియేటర్లలో విడుదల చేయడం జరిగింది. ఇక తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళంలో కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల అయింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు విశాల్ సినిమా ఈ స్థాయిలో విడుదల కాలేదు అంతలా ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది. విశాల్ అనుకున్నదానికంటే ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది.

 కానీ అలా ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందుకు కారణం ముఖ్యంగా ఈ సినిమాను ఎక్కువగా హైప్ చేయలేదు..మొదటి రోజు ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించుకోలేక పోయింది సినిమా.దీంతో ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. మొదటి రోజే బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఎంతలా అంటే థియేటర్ ను మెయింటైన్ చేసేందుకు కూడా సరిపడి డబ్బులు కూడా రాని పరిస్థితుల్లో ఈ సినిమా ఉన్నది అన్నట్లుగా సమాచారం. కనీసం ఇప్పటి వరకు ఈ సినిమా 50 లక్షల రూపాయలను కూడా రాబట్ట లేదట. దీంతో ఈ సినిమా కూడా  విశాల్ కు నిరాశ మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: