'రాధేశ్యామ్' ఫలితం పూజ హెగ్డే కెరీర్ ను ప్రమాదంలో పడేయనుందా?
బాహుబలితో ఒక్క సారిగా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ అప్పటి నుండి వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే బాహుబలి తరవాత భారీ అంచనాల నడుమ సాహో విడుదలవ్వగా అది కాస్తా డిజాస్టర్ గా మారడంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా ఢీలా పడ్డారు. దాంతో అందరి దృష్టి డార్లింగ్ నెక్స్ట్ మూవీపై పడింది. రాధేశ్యామ్' మూవీ అనౌన్స్ అయ్యిందో లేదో ఇక అప్పటి నుండి ఆ సినిమా గురించిన ప్రతి అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఆ తరవాత అంచనాలు వేసేస్తున్నారు. ఆ మధ్య ట్రైలర్ విడుదల చేసినప్పుడు అందులో మొత్తం ప్రభాస్ ఇంగ్లీష్ డైలాగ్స్ చెప్పడంతో ఇది తెలుగు సినిమానా లేక ఇంగ్లీష్ అని నేరుగా సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు.
మళ్ళీ తదుపరి వీడియోతో అంచనాలు పెరిగాయి. ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని కనుక ఇవ్వలేకపోతే బాహుబలితో ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ ఏమైనా తగ్గుతుందా అన్న అనుమానం కొందరి అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. కానీ ప్రభాస్ లాంటి హీరోకి క్రేజ్ తగ్గడమనేది దాదాపు అసాద్యమే అన్నది కొందరి మాట. ఇక మరో వైపు ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న పూజ హెగ్డే కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. ఎందుకంటే మొదట్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కున్న ఈ బామ ఆ తరువాత వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు.
అందులోనూ పారితోషకం కూడా భారీగానే పుచ్చుకుంటున్నారు. అయితే రాధేశ్యామ్ మూవీ ఫలితం కనుక తారు మారైతే ఆ ప్రభావం పూజపై తప్పకుండా పడే అవకాశం ఉందని, ఈమె రెమ్యునరేషన్ కూడా బాగా తగ్గే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇప్పటికే పలు సార్లు రిలీజ్ తేదీని ప్రకటించిన ఈ మూవీ టీమ్ మార్చి 11 న విడుదల కానుంది. మరి ఈ చిత్రం మంచి రిజల్ట్ ను అందించి అందరికీ సంతోషాన్ని అందించాలని ఆశిద్దాం.