ఖిలాడి : హిందీలో రిలీజ్.. పాన్ ఇండియా హిట్ అవుతుందా ?

Purushottham Vinay
మన టాలీవుడ్ హీరోలు రానున్న రోజుల్లో హిందీలో కూడా ఫుల్ గా చక్రం తిప్పేలా కనిపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మన హీరోల సినిమాలు హిందీ ఆడియెన్స్ ను ఎంతో అమితంగా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి.ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు నార్త్ ఆడియెన్స్ అయితే ఫుల్ ఫిదా అవుతున్నారు. యూ ట్యూబ్ లో విడుదలవుతున్న సినిమాలు ఎన్నో వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటున్నాయి. ఇక ఇప్పుడు అయితే ఏకంగా నార్త్ ఆడియెన్స్ ను వెండితెరపై ఆకట్టుకునేందుకు మన హీరోలు గట్టిగానే రెడీ అవుతున్నారు. ప్రభాస్ తరువాత పుష్పతో అల్లు అర్జున్ భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఇక పుష్ప సినిమా అయితే బాలీవుడ్ లోనే ఏకంగా 100కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది. దీంతో ఆ సినిమా ప్రభావంతో మరిన్ని తెలుగు సినిమాలు హిందీలో విడుదలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ముందుగా రవితేజ ఖిలాడి సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతొంది.


తెలుగు హిందీలో ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను A స్టూడియోస్ నిర్మించడం జరిగింది. ఇక హిందీలో పెన్ స్టూడియోస్ ఈ సినిమాని విడుదల చేయబోతోంది. ఇక తప్పకుండా సినిమా హిందీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అంటున్నారు.ఇక సినిమాపై చిత్ర యూనిట్ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది.ఈ సినిమా ఎంతో బాగా వచ్చిందని చిత్ర నిర్మాత చిత్ర దర్శకుడికి ఏకంగా కోటి రూపాయల కారును కూడా బహుమతిగా ఇచ్చేశారు. ఇక హిందీలో కూడా ఈ సినిమా ప్రమోషన్ డోస్ పెంచే విధంగా చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను కూడా రంగంలోకి దింపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే ఇటీవల పుష్పతో హిట్ కొట్టిన అల్లు అర్జున్ అయినా ప్రమోట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.మరి చూడాలి ఖిలాడి సినిమా మంచి పాన్ ఇండియా హిట్ గా నిలుస్తుందో లేదో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: