నటనలో స్పైడర్ మాన్ నటుడి పాట్లు.. మొత్తం చెప్పేసాడుగా?

praveen
హాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు అటు భారత క్రికెట్ ప్రేక్షకులను కూడా అద్భుతంగా అలరించనున్నాయి. అలాంటి వాటిలో స్పైడర్ మాన్ ఒకటి.. ఈ సిరీస్ లో ఎన్ని సినిమాలు వచ్చిన ప్రేక్షకులు మాత్రం ఎంతో అద్భుతంగా ఆదరిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి స్పైడర్ మాన్ సిరీస్ లలో వచ్చిందే స్పైడర్ మాన్ నో వే హోమ్. ఈ సినిమా చూస్తే చాలు హీరోగా నటించిన టామ్ హాలెండ్ కు కనెక్ట్ కాకుండా ఉండలేరు ప్రేక్షకులు. స్పైడర్ మాన్ చిత్రం తో అదరగొట్టిన టామ్ హాలండ్ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు వేసుకుంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అన్ చార్టెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

 అయితే స్పైడర్ మాన్ నో వే హోమ్ లో నటించిన సమయంలో నటనలో ఎంతగానో ఇబ్బంది పడ్డాడట. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే అన్ చార్టెడ్ సినిమా కూడా స్టార్ట్ చేశాడు టామ్ హాలండ్. కాగా  సాధారణ మనుషులతో పోల్చి చూస్తే స్పైడర్ మాన్ నటన కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. కానీ షూటింగ్ సమయంలో టామ్ మాత్రం మామూలుగానే నడవడంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారట. నువ్వు మామూలు మనుషుల్లా నడుస్తున్నావ్ అంటూ చెప్పడంతో ఇక స్పైడర్ మాన్ లా నడక నేర్చుకోడానికి కాస్త సమయం పట్టిందట.. ఇక ఇప్పుడు అన్ చార్టెడ్ సినిమాలో ఉన్న  పాత్ర కాస్త విభిన్నంగా ఉంటుందని చెబుతున్నాడు. ఇక ఈ పాత్ర కోసం 74 కిలోల బరువు పెరగాల్సి వచ్చిందని.. ఆ తర్వాత స్పైడర్ మాన్ లో నటించడానికి 66 కిలోల రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను అంటూ ఇటీవలే ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చాడు.

  స్పైడర్ మాన్, అండ్ చార్టెడ్ సినిమాలతో తనలోని నటుడిని బయటపెట్టాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఫిబ్రవరి 18వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది..ఇక స్పైడర్ మాన్ నటుడు టామ్  సినిమా కావడంతో అటు ప్రేక్షకులు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: