ట్రెండింగ్: ఇది నిజంగానే నయన్ కు రేర్ ఫిట్టేనా..?
అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి ఒక పనిని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నయనతార, చిరంజీవి చేయబోతున్నారన్నట్లు వార్త వినిపిస్తోంది. సైరా నరసింహారెడ్డి మూవీ లో చిరంజీవి కి జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ గాడ్ ఫాదర్ మూవీలో చెల్లెలి పాత్రలో నటిస్తోందట. ఇక ఈ సినిమాలో తన అన్నని తప్పుగా భావించే క్యారెక్టర్లు నయనతార కనిపించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. చివరికి తన చెల్లెలు కష్టంలో ఉందని తెలుసుకున్న తన అన్న ఎలా సహాయ పడతాడో అనే కథాంశంతో ఈ గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కబోతోందన్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాలో నయనతార సోదరి పాత్రలో నటించబోతోంది అని తెలియగానే అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
నయనతార చెల్లెలి పాత్రలో నటించబోతోందా అంటూ కొన్ని ప్రశ్నలు తలెత్తాయట.. కానీ వీటన్నిటికీ సమాధానంగా తెరమీద తెలియజేస్తామని చిత్ర బృందం తెలియజేసినట్లు సమాచారం. ఒకవేళ ఇలాంటి రేర్ ఫిట్ ను రిపీట్ చేస్తే ఇది ఒక అద్భుతమైన సంగతని చెప్పవచ్చు. ఇక నటన పరంగా చిరంజీవి,నయనతార ఇద్దరు కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే ప్రస్తుతం చిరంజీవి నయనతార కు సంబంధించి ఒక సన్నివేశం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోందని సమాచారం.