మాస్ మహరాజ
రవి తేజ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. మొన్నీమధ్య వచ్చిన
క్రాక్ సినిమా తో భారీ విజయాన్ని అందుకున్ని
హీరో ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు.. ఖిలాడీ, రామరావు ఆన్ డ్యూటీ, ధమాకా.. మూడు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. వీటిలో ఖిలాడీ
సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న టీం ఒక్కో సింగిల్ వదులుతూ
సినిమా మీద అంచనాలు భారీగా పెంచెస్తున్నాయి..
ఇప్పటి వరకూ ఈ
సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా
మాస్ అభిమానులను తెగ ఆకర్షించాయి.. ఇదే
జోష్ ను కోనసాగించెలా తాజాగా మరో సాంగ్ ను విడుదల చేశారు. ఫుల్
కిక్ సాంగ్ ఓ ఊపేయగా తాజాగా ఈ
సినిమా నుంచి మరో స్పెషల్ ట్రీట్ వచ్చేసింది. క్యాచ్ మీ అంటూ సాగే ఈ పాటలో.. డింపుల్ హయాతీ,
రవితేజ మధ్య హాట్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అన్నిటికన్నా ముఖ్యంగా పాట లో
హీరోయిన్ అందాలు అందరినీ తెగ ఆకర్షించాయి.. సాంగ్ కు ఆమె అందం హైలెట్ అయ్యింది.
దేవిశ్రీ
ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,
శేఖర్ మాస్టర్ స్టెప్పులు కూడా దుమ్ము లేసిపోయింది.. రమేష్
వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియేస్, ఎల్ఎల్పీ బ్యానర్ల పై
సత్య నారాయణ కోనేరు,
వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో
రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే మరి కొద్ది రోజులలో చిత్ర ప్రీ రిలీజ్
ఈవెంట్ ను నిర్వహిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించారు.. ఈరోజు సాయంత్రం మరో ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం..
ఫిబ్రవరి 11 న
సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.