బండ్ల గణేష్ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును సాధించు కొని ఆ తర్వాత
ప్రొడ్యూసర్ గా మారారు,
ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమాలను నిర్మించారు. ఇది ఇలా ఉంటే
బండ్ల గణేష్ ఆఖరుగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు, ఇదిలా ఉంటే ప్రస్తుతం
బండ్ల గణేష్ 'డేగల బాబ్జి' అనే
మూవీ లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, తాజాగా ఈ సినిమాలోని లిరికల్ వీడియో ను చేసారు, ఈ సందర్భంగా
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఈ మూవీకి సపోర్ట్ చేస్తూ ట్రైలర్,
పోస్టర్ ను విడుదల చేసిన
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి,హరీష్
శంకర్ గారికి
బండ్ల గణేష్ ధన్యవాదాలు తెలిపారు. తమిళం లో పార్థీబన్ చేసిన “ఉత్త సిరుప్పు సైజు 7” నేషనల్ అవార్డు వచ్చింది, ఆ
మూవీ ని తీసుకున్నాను అని నా స్నేహితుడు
వెంకట్ చంద్ర నాకు చెప్పడం జరిగింది, అయితే అనూహ్యంగా ఈ
మూవీ లో నన్ను నటించమని అడిగితే ..నేను యాక్ట్ చేయడమేమిటి.. అని అన్నాను,
కోలీవుడ్ లో పార్థీబన్ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేసిన తను ఎక్కడ.. నేనెక్కడ.. నేను ఈ
సినిమా చేయలేను.. నేను యాక్ట్ చేయను అని చెప్పాను. అయితే స్టోరీ చాలా బాగుంది అని నన్ను కన్విన్స్ చేయడంతో ఈ
మూవీ లో చేయడానికి నేను ఒప్పుకున్నాను, ఒకే రూమ్ లో ఒకే క్యారెక్టర్ ని రెండు గంటల సేపు చేయడం అనేది చాలా రిస్క్, అలాంటి కథను నాతో చేయించారు.
ఈ
మూవీ చేసే వరకు నాలో
గుండె దడ దడ కొట్టుకునేది, భయమేసేది,
మూవీ చేసే క్రమంలో నేను చేయగలననే ధైర్యం వచ్చింది.
మూవీ అంతా పూర్తి అయిన తర్వాత చూసుకుని నేనే ఆశ్చర్యపోయాను, నేనేనా ఇలా నటించింది అని నాలో నేనే నాకు ఆనందం వేసింది. పవన్
కళ్యాణ్ తో
గబ్బర్ సింగ్ సినిమా తీసినప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో ఈ డేగల
బాబ్జి మూవీలో నటించినందుకు కూడా అంతే సంతోషంగా ఉంది అని
బండ్ల గణేష్ తెలియజేశాడు, మరి
బండ్ల గణేష్ 'డేగల బాబ్జి' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.