పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు, అందులో భాగంగా పవన్
కళ్యాణ్,
దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా
నాయక్ సినిమాను ఈ నెల
ఫిబ్రవరి 25 వ తేదీన కానీ ఏప్రిల్ ఒకటవ తేదిన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ఈ
సినిమా కోసం రెండు విడుదల తేదీలను ప్రకటించింది. అయితే ఈ
సినిమా తర్వాత పవన్
కళ్యాణ్ ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన హరిహర వీరమల్లు
సినిమా షూటింగ్ ను మరి కొద్ది రోజుల్లో తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది, అయితే ఈ సినిమాతో పాటే ఇప్పటికే
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ కు
గబ్బర్ సింగ్ సినిమాతో
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్
కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో కూడా నటించబోతున్నాడు, ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే జరిగిపోయింది.
ఈ సినిమాతో పాటు
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ టాలీవుడ్ దర్శకుడు
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్నాడు, ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చాలా రోజుల క్రితమే జరిగింది. ఇది ఇలా ఉంటే భీమ్లా
నాయక్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసిన పవన్
కళ్యాణ్ ఒకే సమయంలో హరిహర వీరమల్లు, సినిమాను అలాగే భవదీయుడు భగత్ సింగ్ సినిమాను
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది, ఇలా పవన్
కళ్యాణ్ త్వరగా సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇది మాత్రమే కాకుండా పవన్
కళ్యాణ్ కొత్తగా తనతో
సినిమా చేయాలనే దర్శకులకు కేవలం రెండు నెలల వ్యవధిలోనే
సినిమా పూర్తి చేయాలి అనే కండిషన్ లు కూడా పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.