బంగార్రాజు సినిమాలో ఉప్పెన బ్యూటీకి అవకాశం ఎలా వచ్చిందో తెలుసా..!

Pulgam Srinivas
ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ లోని స్టార్ హీరోలలి చాలామంది తమ సినిమాలను విడుదల చేయబోతున్నట్లు విడుదల తేదీలను కూడా ప్రకటించారు, అయితే అనూహ్యంగా దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరగడంతో విడుదల తేదీలను ప్రకటించిన స్టార్ హీరోల సినిమాల విడుదలను చిత్ర బృందాలు వాయిదా వేశాయి. ఇలా సంక్రాంతికి ఏ స్టార్ హీరో సినిమా లేకపోవడంతో బంగార్రాజు సినిమా లో చిత్ర బృందం విడుదల చేసింది,  బంగార్రాజు సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కీలక పాత్రలో నటించారు, అయితే ఈ సినిమాలో  కృతి శెట్టి సర్పంచ్ నాగలక్ష్మి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇది ఇలా ఉంటే వాస్తవానికి ఈ సినిమాలో మొదటగా ఈ హీరోయిన్ ను  అనుకోలేదట, అనుకోకుండా కృతి శెట్టి కి ఈ సినిమాలో నటించే అవకాశం దక్కిందట.  ఉప్పెన సినిమా షూటింగ్ సమయంలో బంగార్రాజు సినిమాల్లో నటించమని కృతి శెట్టి ని అడిగారట, అయితే అప్పటికే కృతి శెట్టి రెండు సినిమాలకు ఓకే చెప్పడంతో ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పేసిందట.


 దానితో బంగార్రాజు చిత్ర బృందం ఈ సినిమాలో రష్మిక మందన ను హీరోయిన్ గా తీసుకోవాలి అని అనుకున్నారట, అయితే చివరకు కృతి శెట్టి 'బంగార్రాజు' సినిమా కోసం డేట్స్ ఇస్తాను అని చెప్పిందట. అనుకున్నట్లుగానే మళ్లీ కృతి శెట్టి కు బంగార్రాజు సినిమాలో అవకాశం దక్కిందట, ఇలా రష్మిక మందన ను అనుకున్న చివరిగా బంగార్రాజు సినిమాలో నటించే అవకాశం కృతి శెట్టి కి దక్కిందట, ఇలా బంగార్రాజు సినిమాతో కూడా కృతి శెట్టి మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. బంగార్రాజు సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహించగా అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: