మరో క్రేజీ సినిమాలో అవకాశం దక్కించుకున్న రష్మిక మందన..!

Pulgam Srinivas
ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మీక మందన  పేరు ఇండియా వైడ్ గా మార్మోగిపోతోంది, దానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా, ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవ్వడం, ముఖ్యంగా ఈ సినిమాలో సామి సామి అనే పాటకు రష్మీక మందన వేసిన స్టెప్పులు వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాయి, ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు  అవుతున్నా ఇప్పటికీ కూడా ఈ స్టెప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా ఇండియా వైడ్ గా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మకు మరొక పాన్ ఇండియా  సినిమాలో అవకాశం దక్కినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది, అసలు విషయంలోకి వెళితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను ఇప్పటికే పూర్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే, అలాగే శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా  షూటింగ్ లో ప్రస్తుతం రామ్ చరణ్ పాల్గొంటున్నాడు.


అయితే ఈ సినిమా సెట్స్  ఉండగానే రామ్ చరణ్,  జెర్సీ సినిమాతో  మంచి విజయాన్ని అందుకొని ప్రస్తుతం అదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాకు రామ్ చరణ్ కమిట్ అయ్యాడు, అయితే మరికొన్ని రోజుల్లోనే రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, అయితే అందులో భాగంగా ఈ సినిమాలో రష్మిక మందన ను హీరోయిన్ గా తీసుకోవాలనే  ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇప్పటి వరకు ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు, ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే మాత్రం నేషనల్ క్రష్ రష్మీక మరో పాన్ ఇండియా మూవీ లో ఛాన్స్ దక్కించుకున్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: