బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న అలియా భట్ తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించగా తారక్ కొరటాల శివ కాంబో సినిమాలో కూడా అలియా భట్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారనే విషయం తెలిసిందే.అయితే ఇక తాజాగా అలియా భట్ ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.తారక్ భాష గురించి అలియా భట్ కామెంట్లు చేయడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ కు అలియా భట్ హాజరవ్వడం జరిగింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్న ప్రతి ఈవెంట్ లో కూడా తెలుగు భాషలోనే మాట్లాడుతున్నాడని ఎన్టీఆర్ మాట్లాడే భాష తనకు అర్థం కావడం లేదని అలియా భట్ చెప్పుకొచ్చింది.
ఎన్టీఆర్ చెప్పే మాటలను ఎవరైనా ట్రాన్స్ లేట్ చేస్తారని తాను దిక్కులు చూస్తూ ఉంటానని అలియా భట్ తెలిపింది.అయితే అలియా భట్ కామెంట్లకు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ తాను తెలుగులోనే కాదని హిందీ ఇంకా అలాగే ఇంగ్లీష్ భాషలలో కూడా మాట్లాడుతున్నానని కామెంట్లు చేశాడు. అయితే తాను మాట్లాడే మాటలు అలియా భట్ కు మాత్రం అర్థం కావడం లేదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కూడా అలియా భట్ మాత్రం తారక్ హిందీ ఇంకా అలాగే ఇంగ్లీష్ లో మాట్లాడలేదని నవ్వుతూ ఎదురుదాడి చేయడం గమనార్హం. అలియా చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అయితే అలియా భట్ సరదాగానే అలా కామెంట్లు చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చూస్తుంటే వీళ్లిద్దరు కూడా బాగా కలిసిపోయారని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఫ్యూచర్ లో కూడా వీళ్ళు ఇలాగే ఫ్రెండ్లీగా వుంటారా లేరా అనేది ఇక చూడాలి.