టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు, ఈ సినిమా ఎన్నో అంచనాలతో థియేటర్ లలో విడుదలైంది, కాకపోతే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, హలో సినిమాలు కూడా వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ హీరో కు నిరాశనే మిగిల్చాయి, అలాంటి తరుణంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అఖిల్ టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మమ్ముట్టి కూడా నటిస్తున్నారు.
ఇప్పటికే ఏజెంట్ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది, కాకపోతే జరిగిన ఆ కొంత భాగం షూటింగ్ లోనే చిత్ర బృందం మళ్లీ రీ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఏజెంట్ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి కి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది, ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ ను ఇంకాస్త పకడ్బందీగా తీర్చిదిద్దే క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది, అందులో భాగంగా ఈ సినిమాలో విలన్ పాత్ర దారిని మార్చినట్లు గా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం ఇదివరకు బాలీవుడ్ విలన్ ను తీసుకువచ్చారు, అతనిపై కొన్ని సీన్స్ ను కూడా తెరకెక్కించారు, అయితే అతని స్క్రీన్ ప్రాసెన్స్ నచ్చకపోవడంతో ఇప్పుడు ఆ విలన్ ను తీసి వేసి మరో విలన్ ను తీసుకునే ఆలోచనలో చిత్రం బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త విలన్ వచ్చాక పాత విలన్ కు సంబంధించిన సన్నివేశాలను రీషూట్ చేయనున్నట్లు తెలుస్తోంది, ఇలా ఇప్పటికే జరిగిన ఆ కొంత భాగం షూటింగ్ లో విలన్ కు సంబంధించిన సన్నివేశాలను రీ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.