టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ లేదా ఏప్రిల్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందని మూవీ మేకర్స్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ఏప్రిల్ 1వ తేదీనే థియేటర్లలో రిలీజవుతుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏపీలోని థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా కోసం మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహితుడు త్రివిక్రమ్ రాజమౌళి లాగా చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాని బాగా చెక్కాడట. ఖచ్చితంగా త్రివిక్రమ్ జాగ్రత్తలు సినిమాకి ప్లస్ అవుతాయట.ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమాను పవర్ స్టార్ చూశారని ఆయనకు సినిమా ఎంతగానో నచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలను ఎప్పుడు సడలిస్తే అప్పుడే భీమ్లా నాయక్ సినిమా విడుదల అవువుతుందని ఈ సినిమా మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక భీమ్లా నాయక్ సినిమా మలయాళం బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే భీమ్లా నాయక్ సినిమా మేకర్స్ ప్రధానంగా మూడు మార్పులు చేశారని సమాచారం తెలుస్తుంది. భీమ్లా నాయక్ సినిమా నిడివి అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా నిడివి కంటే అరగంట టైం తక్కువగా ఉండనుంది.అది కూడా త్రివిక్రమ్ సలహా మేరకు మార్పులు చేశారు. ఇక తన మిత్రుడికి ఈ సినిమాతో మంచి హిట్ ఇవ్వాలని త్రివిక్రమ్ తెగ ఆరాట పడుతున్నాడట.మరి చూడాలి త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ప్లస్ అవుతాయో అవ్వవో.. లాస్ట్ టైం అజ్ఞాతవాసితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్లాప్ ఇచ్చిన త్రివిక్రమ్ భీమ్లా నాయక్ సినిమాతో ఆ మచ్చను తుడిచి వేయాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకి పేరుకే సాగర్ చంద్ర దర్శకుడు అయిన మొత్తం త్రివిక్రమే హ్యాండిల్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది..