ఆ టైం లో చాలా భయం వేసింది : ప్రియాంక చోప్రా

praveen
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రియాంక చోప్రా ఎన్నో ఏళ్ల పాటు తన హవాని నడిపించింది. ఇక భారీ రెమ్యునరేషన్ తీసుకునీ అందరిని ఆకర్షించింది. ఎంత మంది హీరోయిన్లు ఉన్నా ప్రియాంక చోప్రా కు మాత్రం ప్రత్యేకమైన క్రేజ్. అందుకే దర్శక నిర్మాతలు ప్రియాంక డేట్స్ కోసం క్యూ కట్టేవారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించిన ప్రియాంక చోప్రా.. ఇక మరికొన్ని సినిమాల్లో తన అందాలతో కూడా మత్తెక్కించింది .ఏకంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇలా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అమెరికన్ పాప్ సింగర్  నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుంది.


 ప్రియాంక చోప్రా తన కంటే చిన్నవాడైన నిక్ పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. నిక్ జోనాస్ తో పెళ్లి తర్వాత హాలీవుడ్లో కూడా ఈ అమ్మడి పేరు తెలిసిపోయింది దీంతో అక్కడ అవకాశాలు అందుకుంటు  హాలీవుడ్లో కూడా బాగా రాణించింది. అయితే ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు ఆత్మ కథలు రాసుకోవడం కామన్ గా మారిపోయింది. ప్రియాంక చోప్రా కూడా 201లో ఆత్మకథ 'అన్ ఫినిష్డ్ ఒన్ మెమరీ' అనే పుస్తకం రాస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని  2019లో విడుదల చేసింది ఈ ముద్దుగుమ్మ.


 ఈ పుస్తకమ్ రాసే సమయంలో తనకు ఎలాంటి భయాలను ఎదుర్కొన్నాను అన్న విషయాన్ని  ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ పుస్తకం రాసే సమయంలో ఎంతగానో భయం వేసేది. ఈ పుస్తకం నేను రాయలేను ఏమో అని చాలా సార్లు అనుకున్నా.. ఏ ఇంటర్వ్యూలో చెప్పని నిజాలు పుస్తకంలో బయటపెట్టాలని అనుకున్నాం.. పుస్తకం రాసే సమయంలో వచ్చే ఆలోచనలు నాలో భయాన్ని కలిగించాయ్ అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ పుస్తకం చదివాక అందరికీ నా బలాలు బలహీనతలు ఫెయిల్యూర్స్ కూడా తెలిసిపోతాయి ఏమో అని భయపడ్డాను. ఒక మహిళగా అందరికీ నా బలాలు మాత్రమే తెలపాలని అనుకున్నాను. ప్రశాంతంగా బతకడానికి కొన్నింటిని దాచితేనే మంచిది అని అనుకున్నాను అంటూ తెలిపింది ప్రియాంక చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: