ఆ రీమేక్ మూవీ లో రానా ప్లేస్ లో నాగ చైతన్య..!

Pulgam Srinivas
ప్రస్తుతం కాలంలో ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయింది అంటే ఆ సినిమాను మరొక భాషలో రీమేక్ చేయడానికి ఇతర భాషా హీరోలు, దర్శక నిర్మాతలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దానికి ప్రధాన కారణం ఆ సినిమా అప్పటికే ప్రేక్షకాదరణ పొంది ఉండటంతో ఈ కథలో  చిన్న చిన్న మార్పులు చేసినట్లయితే మంచి విజయాలను సాధించవచ్చు అనే ఉద్దేశంతో హీరోలు మరియు దర్శకనిర్మాతలు ఉండటమే దానికి ప్రధాన కారణం. అయితే ఇలా ఈమధ్య మలయాళం లో  బ్రో డాడీ అనే సినిమా నేరుగా ఓటిటి లో విడుదల అయ్యింది, ఈ సినిమాకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి ప్రజాదరణ దక్కుతోంది. ఈ సినిమాలో మోహన్ లాల్, పృథ్వి రాజ్ కలిసి నటించారు, ఈ సూపర్ హిట్ మూవీ లో మొదట వెంకటేష్ మరియు రానాలు కలిసి నటించాలి అని అనుకున్నారట.


 కానీ ప్రస్తుతం వెంకటేష్ మరియు నాగ చైతన్య తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇప్పటికే వెంకటేష్ మరియు నాగ చైతన్య కలిసి వెంకీ మామ సినిమాలో నటించారు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో మరో సారి ఒక సూపర్ హిట్ సినిమా రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది, బ్రో డాడీ తెలుగు రీమేక్ మూవీ లో వెంకటేష్, మోహన్ లాల్ పాత్రకి కన్ ఫర్మ్ అవగా పృధ్వి రాజ్ పాత్రలో రానా, నాగ చైతన్య ఇద్దరిలో ఒకరు ఫైనల్ అవ్వాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాతో పాటు నాగ చైతన్య, అమీర్ ఖాన్  ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్ద సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: