మరోసారి యూట్యూబ్‌‌ను షేక్‌ చేసేందుకు సిద్ధమైన ఉప్పెన బ్యూటీ..!!

N.ANJI
చిత్ర పరిశ్రమలో వరుస మూడు సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి కృతి శెట్టి. ఆమె మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కావడానికి ముందే ఈ అమ్మడు ఏకంగా మూడు సినిమాలను ఒప్పుకుంది. ఇక ఉప్పెన సినిమా విడుదలై దాదాపుగా 100 కోట్లు వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో అమ్మడికి వరుసగా అవకాశాలను అందుకుంటుంది. ఇక ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో అరడజను సినిమాలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఇటీవలే శ్యామ్‌ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకులను మరోసారి అలరించింది. మరో రెండు సినిమాలతో ఈ భామ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే అందులో ఒకటి సుధీర్ బాబు హీరోగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ఉప్పెన బేబమ్మ లుక్‌లో కృతిశెట్టి కనిపించనున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లిమ్స్‌ చూస్తుంటే ఖచ్చితంగా ఉప్పెన బేబమ్మను మనం మళ్లీ చూడబోతున్నామని అనిపిస్తుందంటూ మీడియా వర్గాల వారు, నెటిజన్స్‌, సినీ ప్రియులు కామెంట్స్ పెడుతున్నారు.

అయితే తాజాగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఇక కొత్త కొత్తగా అంటూ సాగే ఈ పాటను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. సుధీర్ బాబుతో కృతి శెట్టి రొమాన్స్ కచ్చితంగా పీక్ స్టేజ్‌లో ఉంటుందని తప్పకుండా మరో సారి కృతి శెట్టి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతుందంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. కాగా.. కృతిశెట్టి లుక్‌, లక్‌ బాగుంది కనుక కచ్చితంగా ఆమెతో సుధీర్ బాబు చేసిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని సినీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: