చిన్నప్పటి కల ఇప్పుడు నెరవేరింది...రాశి ఖన్నా..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ నాగ సూర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రాశి ఖన్నా కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు తగ్గాయి.
 


అందులో భాగంగా అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకుంది,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో రాశి ఖన్నా, నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు, అలాగే ఈ సినిమాతో పాటు పక్కా కమర్షియల్ సినిమాలో కూడా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా రాశి ఖన్నా నటిస్తోంది, ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ రాశి ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఫుల్  యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రాశి ఖన్నా తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది,  ఆ వీడియోలో  రాశి ఖన్నా మంచుతో ఆడుకుంటుంది, ఇలా మంచుతో అడలనుకోవడం తన చిన్నప్పటి కల కావడంతో ఆ కోరిక ఇప్పటికి నెరవేరింది అంటూ రాశి ఖన్నా చెప్పుకోచింది. ఇలా రాశి ఖన్నా తన చిన్నప్పటి కలను ఇప్పుడు నెరవేర్చుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: