వావ్.. ఓకే సినిమాలో వెంకీ-రానా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ఓకే ఫ్యామిలీకి సంబంధించిన సంబంధించిన హీరోల సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి  ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు వచ్చాయి అంటే ఊహించని రేంజిలో ఆదరిస్తూ ఉంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో టాలీవుడ్లో తండ్రి కొడుకులు నటించడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. నాగార్జున నాగచైతన్య, చిరంజీవి రామ్ చరణ్ ఇప్పటికే కలిసి నటించారు.



 ఇక నటించాల్సింది..వెంకటేష్ - రానా, బాలయ్య ఎన్టీఆర్.. ఇక వీరి కాంబినేషన్లో  సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇలాంటి సమయంలో అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెప్పారు దగ్గుబాటి హీరోలు. వెంకీ, రానా కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారని అది కూడా తండ్రీకొడుకులుగా నటించబోతున్నారు అంటూ ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.  మోహన్లాల్,  పృథ్విరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'బ్రో డాడీ' సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారట నిర్మాత సురేష్ బాబు. ఈ సినిమాలో మోహన్ లాల్ పృథ్విరాజ్ పాత్రలో తమ్ముడు వెంకటేష్ కొడుకు రానా అయితే బాగా సెట్ అవుతారని భావిస్తున్నాడట నిర్మాత సురేష్ బాబు.



 ఈ క్రమంలోనే ఇక ఇద్దరు తోనే ఈ మళయాళ సూపర్ హిట్ మూవీ తెలుగులో కూడా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడట.  అంతేకాదు ఇక ఓకే ఫ్యామిలీకి చెందిన వెంకటేష్, రానా ఒకే సినిమాలో కలిసి నటిస్తే ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ పొందవచ్చు అని అనుకుంటున్నాడట. ఇక మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్త మాత్రం దగ్గుబాటి అభిమానులందరినీ కూడా ఆనందంలో ముంచెత్తింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: