జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో.. అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అనసూయ.. ఆ తర్వాత సూయ సూయ అంటూ ఐటమ్ సాంగ్ లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. నక్క తోక తొక్కినట్లుగా ఈ అమ్మడికి అవకాశాలు కూడా వచ్చి ముంగిట వాలిపోయాయి.. ఇంకేముంది చిట్టిబాబు చిట్టిబాబు అంటూ రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకులందరిని నటనతో మెప్పించింది ఈ యాంకరమ్మ. ఇక మొన్నటికి మొన్న పుష్ప సినిమాలో దాక్షాయణిగా నటించి వామ్మో అనసూయ లో ఇలాంటి విలనిజం కూడా దాగి ఉందా అని అందరిని భయపెట్టింది. ఇలా జబర్దస్త్ నుంచి మొన్నటి పుష్ప వరకు తనను తాను ఎప్పుడూ కొత్తగా ప్రేక్షకులకు చూపిస్తూనే వస్తుంది అనసూయ.
ఇక విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ఎంతగానో గుర్తింపును సంపాదించుకుంది. ఇక రానున్న రోజుల్లో పుష్ప రెండవ పాపార్ట్ లో అనసూయ పాత్ర మరింత పవర్ఫుల్గా ఉండబోతుంది అన్న టాక్ కూడా ఉంది. ఇలా ఎన్ని సినిమాల్లో నటించినా తనకు అన్నం పెట్టిన జబర్దస్త్ ను వీడకుండా నిజాయితీగా నే ముందుకు సాగుతుంది అనసూయ. ఇక ఇప్పుడు అనసూయ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక సినిమాలో కేవలం ఒకే పాత్రలో నటించిన అనసూయ ఇక ఇప్పుడు మాత్రం రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతుందట. ఇక ఈ సినిమాలో ఒక పాత్ర చనిపోతే.. మరో పాత్ర మాత్రం కథలో కీలకం గా చివరి వరకు ఉంటుందని టాక్. ఏదేమైనా అనసూయ ద్విపాత్రాభినయం అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇక రవితేజ ఖిలాడి సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలలో కూడా నటిగా ఎంతో గుర్తింపు తెచ్చే కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అనసూయ ఇండస్ట్రీలో తనని తాను నిలదొక్కుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ ఉండటం గమనార్హం