బాలయ్య షో విజయవంతం కావడానికి ఆ వ్యక్తినే కారణం..??

N.ANJI
టాలీవూడ్ స్టార్ హీరోలలో ఒక్కరైనా నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వెండితెరపై సందడి చేస్తూనే.. బుల్లితెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బాలయ్య నటించిన అఖండ సినిమాతో థియేటర్లతో పాటు డిజిటల్ లోనూ సత్తా చాటుకుంది. కాగా.. ఈ చిత్రం ఓటీటీ వేదిక మీద కూడా దూసుకెళ్తుంది. అయితే ఇటీవల హా ఓటీటీ బాలయ్యలోని మరో కోణాన్ని బయటకు తీసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అనేలా బాలయ్యతో ఓ షోను రూపొందించారు. ఈ షో టైటిల్ కు తగినట్లుగానే ఆయన ఎనర్జీకి సరిపోయేలా అన్ స్టాపబుల్ షోతో అదుర్స్ అనిపించారు. ఈ షో  తొలి సీజన్ తో ఇండియాలోనే టాప్ షోగా గుర్తింపు తెచ్చుకుంది. బాలయ్యా ఈ షోతో హోస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే తొలి సీజన్ ఓ రేంజిలో సూపర్ సక్సెస్ కావడంతో త్వరలో రెండో సీజన్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఇప్పటికే సెకండ్ సీజన్ కోసం ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆహా టీం ఈ సీజన్ కూడా మరో రేంజిలో సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షో ఇంత అద్భుతంగా సక్సెస్ కావడానికి కారణం ఎవరు అనే చర్చ ఎక్కువగా జరుగుతుంది.

అంతేకాక.. తనలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ బయటకు రావడానికి కారణం ఏంటి? అని అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక అందుకు కారణం ఓ వ్యక్తి అని తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరో ఒక్కసారి చూద్దామా. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి రైటర్ అని అందరికి తెల్సిందే.

ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే బాలయ్య అన్ స్టాపబుల్ షో కోసం బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా పని చేసినట్లు చెప్పుకొచ్చారు. కాగా.. బాలయ్యను ఈ షోలో కొత్తగా చూపించేందుకు తను చాలా ప్రయత్నించిందని అన్నారు. ఆమె అన్‌స్టాపబుల్ టీమ్‌తో పని చేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: