బర్త్ డే స్పెషల్: బ్రహ్మీ సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Satvika
తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలో కమెడీయన్ గా పరిచయం అయ్యి ఇప్పుడు స్టార్ కమెడీయన్ గా పేరు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలు సైతం ఈయన కామెడి సినిమాల లో వుండాలని కోరుకుంటున్నారు ఇంకా గిన్నిస్ బుక్ రికార్డ్ ను కూడా అందుకున్న ఘనత ఆయనకు ఉంది. అప్పటికి ఇప్పటికే ఎందరో నటులకు ఆదర్షంగా నిలుస్తున్నారు.. అందుకే బ్రహ్మీని నవ్వుల బాద్షా.. ఎక్కడో ఓ చిన్న లెక్చరర్‌గా జీవితం మొదలు పెట్టిన ఈయన.. ఈ రోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ఘనత ఇతనికే సాధ్యం..


1250 సినిమాలకు పైగా నటించి, ఆడియన్స్‌కు బోర్ కొట్టించకుండా నటించాడు మన బ్రహ్మీ..1987 లో జంధ్యాల తెరకెక్కించిన అహ నా పెళ్లంట లో ఈయన చేసిన అరగుండు పాత్ర అదిరిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో నంది అవార్డులను అందుకొలెదు. మూడు సైమా అవార్డులు సొంతం చేసుకున్నాడు ఈ లెజెండరీ.. దర్శకులు చెప్పిన దానికన్నా ఎక్కువగా తన పాత్ర లో జీవిస్తారు. ఇకపోతే    కొన్ని డైలాగులు తన కోసమే పుట్టాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు.


ప్రస్తుతం బ్రహ్మి చాలా తక్కువ సినిమాల్లోనే చేస్తున్నాడు. ముఖ్యంగా కృష్ణ వంశీ రంగమార్తాండ సినిమా లో సీరియస్ పాత్ర లో నటిస్తున్నాడు బ్రహ్మానందం.. ఇలా కొన్ని సినిమాల తో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున సినిమాలకు కొద్ది రోజులు దూరంగా ఉన్నారు. మరో అర డజన్ సినిమాలు కూడా చేస్తున్నాడు ఈ సీనియర్ కమెడియన్. 2009లో ఈయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ ఇచ్చింది.. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మా ఛానెల్ తరపున కోరుకుంటున్నారు.. హ్యాపీ బర్త్ డే బ్రహ్మానందం గారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: