మాస్ మహారాజా
రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, అందులో భాగంగా
రవితేజ ప్రస్తుతం
రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో
రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి
చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై మంచి అంచనాలను కలగజేశాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగిఉన్న ఈ సినిమాను
ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే
రవితేజ ఈ సినిమాతో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో
రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్న
రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే రావణాసుర సినిమాలో కూడా నటించబోతున్నాడు, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని
పోస్టర్ లను చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేయగా వీటిని జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది, ఇదిలా ఉంటే ఈ సినిమాలో
రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, అయితే ఈ సినిమాలో
రవితేజ పూర్తి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, కెరీర్ ప్రారంభంలో కూడా
రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించాడు, మరొకసారి రావణాసుర సినిమాలో
రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే
రవితేజ ఈ సినిమాలతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాలో కూడా నటించబోతున్నాడు, అలాగే టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో కూడా
రవితేజ నటించబోతున్నాడు.