శ్రీహరి మరణం వెనుక ఉన్న అస్సలు రహస్యం అదేనా..?

murali krishna
ప్రముఖ నటుడు అయిన శ్రీహరి కొన్నేళ్ల క్రితం ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే. నటుడు మేకా రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇప్పటికీ చదువుతున్నానని ఎంఫిల్ కోర్సులో తాజాగా జాయిన్ అయ్యానని ఆయన వెల్లడించారు.
సీనియర్ ఎన్టీఆర్ తెలుగు యూనివర్సిటీని ఏ సంకల్పంతో పెట్టారో తెలియదని తెలుగు యూనివర్సిటీ ఒక కళా నిలయమని మేకా రామకృష్ణ అన్నారట.
కళాకారులకు మరియు ఔత్సాహికులకు తెలుగు యూనివర్సిటీ పుణ్య స్థలమని మేకా రామకృష్ణ చెప్పుకొచ్చారు. అక్కడ చదివిన వాళ్లు ఎంతోమంది కూడా బయట ప్రదర్శనలు ఇస్తూ ఉన్నత స్థానాలకు ఎదిగారని మేకా రామకృష్ణ కామెంట్లు చేశారు. అక్కడ నుంచి వచ్చినవాళ్లలో 500 మంది ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారని మిగిలిన వాళ్లు మాత్రం డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నారని మేకా రామకృష్ణ వెల్లడించారట.
ఒక ఆర్టిస్టుకు నాటకమా మరియు సినిమానా అనే విషయంలో తేడా ఉండదని రెండిటికి చాలా తేడా ఉంటుందని మేకా రామకృష్ణ అన్నారట.
నటులకు నాటక రంగంలో మాత్రమే సంతృప్తి కలుగుతుందని మేకా రామకృష్ణ చెప్పుకొచ్చారని తెలుస్తుంది.. నాటకాలలో స్క్రిప్ట్ ను మనకు అనుకూలంగా రాసుకోవడం అది సాధ్యమవుతుందని మేకా రామకృష్ణ వెల్లడించారు. సినిమాలలో లిమిటేషన్స్ ఉంటాయని సీరియళ్లలో కూడా ఇదే పరిస్థితి అని రామకృష్ణగారు అన్నారు.

1987 నుంచి శ్రీహరితో క్లోజ్ గా ఉన్నానని సినిమాల్లో సక్సెస్ కావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారని రామకృష్ణ చెప్పుకొచ్చారట.శ్రీహరి అందరితో కలిసిపోతారని డేర్ నెస్ ఎక్కువ అని రామకృష్ణ తెలిపారు.. పాన్ పరాఖ్ ఆయన బాగా నములుతారని అదే ఆయన ఆరోగ్యంపై బాగా ఎఫెక్ట్ చూపించి ఉండవచ్చని మేకా రామకృష్ణ వెల్లడించారు. శ్రీహరి భుజంపై చెయ్యి చేసి స్నేహపూర్వకంగా మాట్లాడేవారని రామకృష్ణ వెల్లడించారు. రామకృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.శ్రీహరి అభిమానులు ఆయనను గుర్తుచేసుకొని తెగ భాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: