రవితేజ కథానాయకుడిగా.. డింపుల్ హయాతి కథానాయకిగా నటిస్తున్న చిత్రం ఖిలాడీ.. ఈ సినిమాని డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా వచ్చే నెల 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అందుచేతనే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ను పనులు కూడా మొదలుపెట్టారు చిత్ర బృందం. అందుకు సంబంధించి కొన్ని కీలకమైన పాత్రలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్న మురళి శర్మ కు సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించబోతున్నారు మురళి శర్మ.
మురళి శర్మ కమెడియన్ గా, విలన్ గా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ఇక ఖిలాడి సినిమాలో కూడా మురళి శర్మ పుట్టపర్తి గెటప్లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక లుక్ పోస్టర్ వైరల్ గా మారుతుంది. ఇక అంతే కాకుండా ఆరోగ్య జాగ్రత్తలు ఎక్కువగా పాటిస్తున్నట్లు ఉండే పాత్రలో నటిస్తున్నాడని చిత్ర బృందం తెలియజేసింది. ఇక మురళీ శర్మ పోస్టర్ విషయానికి వస్తే ఇందులో పైజామా లుక్ లో కనిపించబోతున్నాడు. మొత్తానికి మురళీ శర్మ పాత్ర ను చూస్తే బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
ఇక రవితేజ కూడా ఈ మూవీపై ఎంతో నమ్మకంతో ఉన్నాడు.. క్రాక్ మూవీ తర్వాత రవితేజ విడుదల చేయబోతున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు.. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతూ ఉండడంతో ఎట్టకేలకు ఈ సినిమాని ఫిబ్రవరి 11 న విడుదల చేయడానికి సిద్ధమైపోయారు చిత్ర బృందం. ఇక గతంలో కూడా క్రాక్ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో జనాలు బాగా వెళ్లడం జరిగింది. దీంతో ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఖిలాడి మూవీ పాజిటివ్ టాక్ వస్తే భారీగానే వసూళ్లను కలెక్షన్ చేస్తుందని చెప్పవచ్చు.