‘ఆచార్య’ తో ‘ఎఫ్3’ పోటీ.. విజయం ఎవ‌రిదో..?

MOHAN BABU
ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి అంద‌రినీ ప‌ట్టి పీడిస్తోంది. ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు ముఖ్యంగా సీని ప‌రిశ్ర‌మ‌ను ఎక్కువ‌గా కుదిపేస్తున్న‌ది. కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే కాదు రెండు సార్లు అంత‌క‌న్న కాదు.. ముచ్చ‌ట‌గా మూడు వేవ్‌ల‌లో సినిమా రంగాన్ని ఛిద్రం చేసింది. చిన్న సినిమాల నుంచి భారీ స్థాయిలో విడుద‌ల చేసే పాన్ ఇండియా చిత్రాల వ‌ర‌కు క‌రోనా దెబ్బ‌కు ఒక‌దాని త‌రువాత ఒకటి వాయిదా వేయాల్సి వ‌చ్చింది. ఇంకా చాలా మంది నిర్మాత‌లు ఈ క‌రోనా గ‌డ్డు కాలం నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఓటీటీ బాట ప‌డుతున్నారు. కొర్ని చిత్రాల‌ను మాత్రం ధైర్యం చేసి థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తున్నారు.

గ‌త కొంత కాలంగా భారీ ప్రాజెక్ట్ విడుద‌ల తేదీల‌పై సందిగ్ద‌త నెల‌కొన్న విష‌యం తెలిసిన‌దే. తాజాగా మేక‌ర్స్ వాట‌న్నింటిని తొల‌గిస్తూ.. విడుద‌ల తేదీల‌ను ప్ర‌టించేశారు. వాయిదాను ఒక‌రి త‌రువాత ఒక‌రూ ఏవిదంగా వాయిదా వేశారో విడుద‌ల తేదీల‌ను కూడా ఒక‌రి త‌రువాత మ‌రొక‌రూ అదేవిధంగా ప్ర‌క‌టించేశారు. తొలుత ఆర్ఆర్ఆర్‌, ఆచార్య, భీమ్లానాయ‌క్‌, ఆ త‌రువాత ఎఫ్‌-3 వెంట వెంట‌నే విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించారు. ఆర్ఆర్ఆర్ మార్చి 25న‌, ఆచార్య ఏప్రిల్ 29న‌, భీమ్లానాయ‌క్ మాత్రం ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న  విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ అఫీషియ‌ల్‌గా రెండు తేదీల‌ను అనౌన్స్ చేసింది.

ముఖ్యంగా క‌రోనా ప‌రిస్థితులు వచ్చే నెల‌లో చాలా వ‌ర‌కు త‌గ్గితే ఫిబ్ర‌వ‌రి 25 విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తున్న‌ది. లేనయెడ‌ల ఏప్రిల్‌01 వ‌ర‌కు మాత్రం ఆగాల్సిందే అని తెలుస్తోంది. ఈ సినిమాను సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సితారా ఎంట‌ర్‌టైన్ మెట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు.   ముఖ్యంగా ‘ఆచార్య‘ ‘ఎఫ్ 3’ లాంటి సినిమాలు కూడా వాయిదా పడిన సంగతి తెలిసిన‌దే. తాజాగా రెండు సినిమాలు కొత్త విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించాయి. రెండు సినిమాల్లో ఒక్క‌రోజు గ్యాప్‌లో థియేట‌ర్ల‌లో పోటీ ప‌డనున్నాయి. ఏప్రిల్ 28న ఎఫ్‌-3 అడుగుపెడుతుండ‌గా..ఏప్రిల్ 29న ఆచార్య రానున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అన్ని ఆలోచించుకుని అంద‌రి సూచ‌ల‌ను తీసుకొని ఆచార్యను ఏప్రిల్ 29న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్‌. అదేవిధంగా ఆర్ఆర్ఆర్, మార్చి 25న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ద‌ని కూడా తెలిపారు. దీంతో ఆతేదీని రాజ‌మౌళికి ఇచ్చిన‌ట్టు మేక‌ర్స్ వెల్ల‌డించారు.  మ‌రొక వైపు మార్చి 11న రాధేశ్యామ్ విడుద‌ల‌వుతుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇక‌పోతే ఎఫ్‌-3 రెండు డిఫరెంట్ క‌థ‌నాలు, ఒక‌టి న‌వ్వులు పూయిస్తే.. మ‌రొక‌టి ఆలోచింప‌జేస్తుంది. మ‌రీ ఈ రెండు సినిమాల‌లో ఏదీ భారీ హిట్గా నిలుస్తుందో చూడాలి మ‌రీ.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: