వావ్:తెలుగు సినిమా ఇండస్ట్రీని పొగిడేస్తున్న ప్రియమణి..కారణం..?
ఇక అంతే కాకుండా కొన్ని కోట్లు రాబట్టుకొని దర్శక నిర్మాతలు బాగా వెనకేసుకున్న వారు ఉన్నారు. ఇటీవల ప్రియమణి తెలుగు సినిమా స్టోరీ లు బాలీవుడ్లోకి మంచి ఆదరణ రావడానికి కారణం చెప్పుకొచ్చింది.. ఒకప్పుడు మన తెలుగు హీరోయిన్లు.. శ్రీదేవి,హేమమాలిని, వైజయంతి, రేఖ వంటి నటులు ఉండేవారు.. వీరంతా బాలీవుడ్ లో బాగానే కనిపించారు. కానీ ఆ తరువాత హీరోయిన్లు ఎవరు అక్కడ అంతగా కనిపించలేదు.. ప్రస్తుతం బాలీవుడ్లో హిందీ మాట్లాడే నటీనటులే ఉన్నారు అని తెలియజేసింది. ఇక చెన్నై, కేరళ, సౌత్ ఏరియాల నుంచి ఎవరు వెళ్ళినా కూడా.. బాలీవుడ్ లో హిందీ మాట్లాడనివారు గా గుర్తిస్తారని తెలియజేశారు.
అయితే కాలం మారుతున్న కొద్దీ అన్నీ ఇండస్ట్రీలలో మార్పులు వచ్చాయి.. తెలుగు టెక్నీషియన్లను బాలీవుడ్ కి తీసుకు వెళ్లడం.. వారు అక్కడ బాగా రాణించడంతో ఎక్కువ పరిచయాలు ఏర్పడి.. నెమ్మదిగా బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కూడా మన మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది అక్కడికి వెళుతున్నారని తెలియజేసింది ప్రియమణి. ప్రియమణి బాలీవుడ్ లోకి రావణ్, రక్త చరిత్ర-2, చెన్నై ఎక్స్ప్రెస్ వంటి సినిమాలలో నటించింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో మరొక మూవీ లో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.