సూపర్ స్టార్ మహేష్ బాబు 2019 వ సంవత్సరంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, అయితే అలాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు 'గీత గోవిందం' ఫెమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాల యూ అమాంతం పెంచేశాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సంక్రాంతి బరి నుండి తపించి ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే మహేష్ బాబు మోకానికి సర్జరీ జరగడం వల్ల కొన్ని రోజుల సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఆగిపోయింది, అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది, కాకపోతే ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడం లేదు అని తెలుస్తోంది. మహేష్ బాబు వచ్చే వారం నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది, అంతలోపు మహేష్ బాబు అవసరం లేని సన్నివేశాలను తెరకెక్కించే ఆలోచనలో సర్కారు వారి పాట చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.