వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడట అక్కినేని వారసుడు..యంగ్
హీరో నాగ చైతన్య కెరీర్ లో ప్రయోగాలు కూడా చేయబోతున్నాడట . రొటీన్ సినిమాలకు స్వస్తి చెపుతున్నాడని తెలుస్తుంది
అక్కినేని
హీరో నాగచైతన్య పక్కా ప్లాన్ తో దూసుకుపోతున్నాడట. కెరీర్ ను రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడట.సినిమా కథలను తోందర పడకుండా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది. కెరీర్ బోరింగ్ కాకుండా ఎక్స్ పెర్మెంట్ మూవీస్ ను ప్లాన్ చేసుకుంటన్నాడట చైతూ. హీరోగానే కాకుండా నెగెటివ్ క్యారెక్టర్స్ వైపు కూడా చూస్తున్నాడని తెలుస్తుంది.
ఇప్పటికే నాగచైతన్య(Naga Chaitanya).
లవ్ స్టోరీ మరియు బంగార్రాజు సినిమాలతో సక్సస్ కొట్టి ఉన్నాడు.ఈ కరోనాపాండమిక్ లో కూడా మిగతా యంగ్ హీరోలకంటే ఒక అడుగు ముందే ఉన్నాడట . ప్రస్తుతం
విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థ్యాంక్యూ
మూవీ చేస్తున్నాడటా చైతు.ఈమూవీతో పాటు..బాలీవుడ్ లో
అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చద్దాలో నటించాడు చైతన్య(Naga Chaitanya).. ఈమూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోందని సమాచారం.వీటితో పాటు మరికొన్ని సినిమాలు చైతూ ఖాతాలో ఉన్నాయట.
మజిలీ తరువాత
నాగచైతన్య సెలక్షన్ లో భారీ మార్పు వచ్చింది. ఇక ఇప్పుడు కెరీర్ లో ఎక్స్ పెర్మెంట్స్ కు పెద్ద పీటవేస్తున్న నాగచైతన్య(Naga Chaitanya) హీరోగానే కాకుండ నెగెటీవ్ రోల్స్ చేయడానికి కూడా సై అంటున్నాడట. ప్రస్తుతం అదే పనిలో కూడా ఉన్నాడని తనతో థ్యాంక్యూ
సినిమా తెరకెక్కిస్తున్న
విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో
అమెజాన్ ప్ర్రైమ్ కోసం వెబ్
మూవీ చేస్తున్నాడట చైతూ ఈ మూవీలో చైతూ నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నారట . అంతే కాదు చైతు లుక్ కూడా కొత్తగా డిజైన్ చేశాడట
విక్రమ్ కుమార్.
ఆడియన్స్ కు చైతూలో కొత్త కోణాన్ని పరిచయం చేయబోతున్నట్టు సమాచారం.
నాలుగు నెలల క్రితం స్టార్
హీరోయిన్ సమంతతో డివోర్స్ కూడా ప్రకటించాడు నాగచైతన్య.ఇప్పుడిప్పుడే విడాకుల హడావిడి నుంచి బయట పడుతున్నారట ప్రస్తుతం థాంక్యూ షూటింగ్ కోసం.. టీమ్ తో కలిసి
మాస్కో పర్యటనలో ఉన్నట్టు సమాచారం.అక్కడ చైతూతో కలిసి మంచు పడుతున్న టైమ్
రాశీ ఖన్నా హడావిడి చేస్తోందట.