యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన
బాహుబలి సినిమాతో తన
మార్కెట్ ను పాన్
ఇండియా రేంజ్ లో పెంచుకున్నాడు, అయితే
బాహుబలి సినిమాతో ఏర్పడిన పాన్
ఇండియా మార్కెట్ ను అలాగే కంటిన్యూ చెయ్యాలనే ఉద్దేశంతో
ప్రభాస్ కూడా వరుస పాన్
ఇండియా సినిమాలలో, అంతకుమించిన సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.
ప్రభాస్ అందులో భాగంగా ఇప్పటికే రాదే
శ్యామ్ సినిమాను పూర్తి చేశాడు, ఈ సినిమాను
సంక్రాంతి కానుకగా
జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది, కాకపోతే ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో
కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో ఈ
సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది.
ఇప్పటి వరకు ఈ
సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించలేదు, ఇదిలా ఉంటె
ప్రభాస్ ఈ సినిమాతో పాటు
ఆది పురుష్ సినిమాలో కూడా నటిస్తున్నాడు, అలాగే
ప్రభాస్,
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ సినిమాలతో పాటు
ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా నటిస్తున్నాడు, అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది,
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే
సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కబోతునట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమాకు
నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాను
నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాతో పాటు
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీలో కూడా నటించబోతున్నాడు.