తెలుగు పాపులర్
రియాలిటీ షో అయిన
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగిసిన నాటి నుంచి నెక్స్ట్ సీజన్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట.
నెక్స్ట్ సీజన్ 'ఓటీటీ ' వర్షన్ అని అప్పట్లో వార్తలు రాగా అది కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోందట.ఈ షోకు కూడా
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జుననే హోస్ట్ కాగా, త్వరలో ఈ షో స్టార్ట్ కానుందట.ఈ 'బిగ్ బాస్' ఓటీటీ వర్షన్ షో 24 హవర్స్ టెలికాస్ట్ కానుందట.. దాదాపు 82 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సమాచారం. ఇకపోతే ఈ షోలో కంటెస్టెంట్స్ గా వెరీ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి పర్సన్స్ ను సెలక్ట్ చేసినట్లు టాక్ నడుస్తుంది.కాగా, వచ్చే నెల చివరిలో వారంలో షో స్టార్ట్ కానుందని సమాచారం.
సీజన్ ఫైవ్
విన్నర్ గా వీజీ సన్నీ టైటిల్ గెలుచుకోగా, రన్నర్ గా యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ నిలిచిన విషయం అందరికీ విదితమే.ఇప్పటికే సోషల్ మీడియాలో 'బిగ్ బాస్' ఓటీటీ కంటెస్టెంట్స్ పైన రకరకాల ఊహాగానాలు కూడా వస్తున్నాయి. పలువురిని సెలక్ట్ చేసినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.కానీ, అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మాత్రం రాలేదు. ఈ ఓటీటీ వర్షన్ లో కంటెస్టెంట్స్ కు ఇవ్వబోయే టాస్కులు మరియి వారికి పెట్టే పరీక్షలు చాలా కొత్తగా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని .ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం
జబర్దస్త్ యాంకర్ వర్షిణి అలాగే యూట్యూబర్ యాంకర్
శివ కంటెస్టెంట్స్‌గా ఫైనల్ అయ్యారట. టిక్ టాక్ తో ఫేమస్ అయిన 'ఉప్పల్' బాలు అలాగే ప్రముఖ యూట్యూబర్ ఒకరు కూడా సెలక్ట్ అయినట్లు సమాచారం.. ఈ బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ షో నిర్వాహణను ఫేమస్ యాంకర్ ఓంకార్ నిర్మాణ సంస్థ 'ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్'కు అప్పజెప్పారని సమాచారం. అయితే, ఈ షోకు యాంకర్‌గా
నాగార్జున వ్యవహరిస్తూ నిర్వహణ బాధ్యతలు ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ కు ఇస్తారా? అనే ప్రశ్నలు కూడా ఎదురవతున్నాయని . నిర్వహణ విషయమై ఇప్పటివరకు ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదని తెలుస్తుంది.