స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు కొత్త తలనొప్పి మొదలైందిగా...?

murali krishna
ఎస్ ఎస్ థమన్.. ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చేస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా వరుస విజయాలు అందుకుంటున్నాయని గడిచిన రెండు సంవత్సరాలుగా ఆయన పట్టిందల్లా బంగారం అవుతుందట.

బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ రూపొందిస్తూ మంచి స్వింగ్ లో కొనసాగుతున్నారట థమన్ . సినిమా సక్సెస్ తో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ మంచి ప్రతిభ కనబరుస్తున్నాడట థమన్. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులకు ఫస్ట్ ఛాయిస్ అయ్యాడని తెలుస్తుంది.. థమన్ మ్యూజిక్ అందించాడు అంటే కనీసం ఆడియో రైట్స్ కు అయిన ఐదు కోట్ల రూపాయలు వస్తాయనే టాక్ నడుస్తుంది. నిర్మాతలు మంచి లాభాలు అందుకోవడంలో తన వంతు కూడా సహకరిస్తున్నాడు థమన్. కవర్ సాంగ్స్ విషయంలో మాత్రం ఇబ్బంది కరంగా మారుతున్నాడనే టాక్ మాత్రం నడుస్తుంది. ఇంతకీ ఎందుకు ఆ అభిప్రాయం కలుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అల వైకుంఠపురంలో సినిమా విజయంలో థమన్ ముఖ్య పాత్ర పోషించాడు అని చెప్పుకోవచ్చు. ఈయన కంపోజ్ చేసిన ప్రతి పాట కూడా జనాలను ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి. సినిమా విజయంలో ఆయన మ్యూజిక్ ఎంతగానో సహకరించింది. ఈ సినిమా పాటలన్నీ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ సినిమాకు సంబంధించి లిరికల్ వీడియోలకు బదులుగా కొన్ని కవర్ సాంగ్స్ కూడా విడుదల చేశారు. అయితే ఈ ఐడియా కూడా వర్కౌట్ అయ్యింది. దీంతో థమన్ మ్యూజిక్ అందిస్తున్న పెద్ద సినిమాల విషయంలో లిరికల్ వీడియోలు కాకుండా కవర్ సాంగ్స్ షూట్ చేస్తున్నారట.. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం తమన్ పై వ్యంగ్యంగా కామెంట్లు విసురుతున్నారని తెలుస్తుంది.. పాటలు బాగున్నాయ్ అంటూనే కవర్ సాంగ్స్ పై ట్రోల్ చేస్తున్నారట.

తాజాగా తమన్ సర్కారు వారి పాట సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడటా . ఇప్పటికే రిలీజ్అయిన మోషన్ పోస్టర్ కు అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుందని అటు వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న SVP ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి కూడా రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ ఫోటో కాకుండా కేవలం తమన్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ పోస్టర్ వదిలారట.. దీనిపై మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట దీంతో ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ చేయాలా? వద్దా? అని మదనపడుతున్నాడట థమన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: