20 వేల థియేటర్ లలో ప్రభాస్ సినిమా..!

frame 20 వేల థియేటర్ లలో ప్రభాస్ సినిమా..!

Pulgam Srinivas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను పెంచుకున్నాడు, అయితే ఆ తర్వాత కూడా  అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని చేయాలనే ఉద్దేశంతో ప్రభాస్ కూడా వరుస పాన్ ఇండియా అంతకుమించిన సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.  అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నాడు,  ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వస్తున్నాడు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వీలైనంత త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.


ఈ నేపథ్యంలో 'ఆది పురుష్' మూవీ బడ్జెట్ రిలీజ్పై పలు ఆసక్తిర విశేషాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి,  ఆది  పురుష్ సినిమా మొత్తం బడ్జెట్ రూ. 400 కోట్లు అని తెలుస్తోంది, సుమారు 15 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20,000  థియేటర్ లాలి ఒకేసారి ఆది పురుష్ సినిమా రిలీజ్ కానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సినిమాతో పాటు ఇప్పటికే రాదే శ్యామ్ సినిమాను పూర్తి చేశాడు, ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోగా నటించింది, ఈ సినిమాను జనవరి 14 వ తేదిన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది,  కాకపోతే దేశంలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది,  ఇప్పటి వరకు ఈ సినిమా కొత్త విడుదల  తేదీని చిత్ర బృందం ప్రకటించలేదు. అలాగే సలార్, ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నడు, మరియు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ లో నటించడానికి ప్రభాస్ రెడీ గా ఉన్నాడు, ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: