400 కోట్ల డీల్.. తగ్గేదేలే అంటున్న స్టార్ హీరోయిన్?

praveen
సినిమా హీరోయిన్ లకు చిత్ర పరిశ్రమలో కెరియర్ చాలా తక్కువ కాలమే ఉంటుంది అనేవారు. ఇక హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు అంటే కెరీర్ మొత్తం ఆగిపోయినట్లే అని అనుకునే వారు అందరూ. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది హీరోయిన్లు పెళ్లికి ముందు  స్టార్ హీరోయిన్లుగా కొనసాగడమే కాదు పెళ్లి తర్వాత కూడా అంతకు మించిన జోష్ తో వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు ఇలా సూపర్ స్పీడ్ తో దూసుకుపోతున్నారూ. అయితే ఒకప్పుడు హీరోయిన్లకు కేవలం సినిమాలు మాత్రమే ఉండేవి కానీ ఇటీవల కాలంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కడం తో ఓటిటి లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

 దీంతో ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఓటీటీ వేదికగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. మరి కొంత మంది సొంత నిర్మాణంలో వెబ్ సిరీస్ తెరకెక్కించి  ఇక వాటితో సూపర్ సక్సెస్ అవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి కోవలోకే వస్తుంది అనుష్క శర్మ. స్టార్ హీరోయిన్ లో వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక విరాట్ కోహ్లీ తో పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తుంది అని చెప్పాలి. కానీ వరుసగా వెబ్ సిరీస్ ల తో మాత్రం ప్రేక్షకులను అలరిస్తోంది.

 ఇకపోతే ఇటీవలే బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మ ఏకంగా 400 కోట్ల డీల్ కుదుర్చుకుంది అంటూ ఒక టాక్ ప్రస్తుతం బాలీవుడ్ లో చెక్కర్లు కొడుతుంది. ఓటిటి ఫ్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్  అనుష్కశర్మ కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుష్కతో కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు డాక్యుమెంటరీలు తీసేందుకు గానూ 400 కోట్ల తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్. ఇప్పటికే పాతల్ లోక్, బబుల్ లాంటి వెబ్ సిరీస్ ల తో అనుష్క శర్మ మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్  ఈ ముద్దుగుమ్మ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: