ఆ విషయంలో హరికృష్ణపై మండిపడ్డ సీనియర్ ఎన్టీఆర్..!

murali krishna
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నమ్మిన బంటుగా హరికృష్ణ ఉన్న అందరికి తెలిసిందే. నందమూరి హరికృష్ణకు ఇద్దరు భార్యలు అలాగే నలుగురు సంతానం.

భార్యల పేర్లు లక్ష్మీ మరియు షాలిని. జానకిరామ్ మరియు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కొడుకులు. సుహాసిని ఆయన కూతురు. హరికృష్ణ మృతితో ఆయన ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది.. అంతేకాదు ఆయన అభిమానులు ఏ మాత్రం కూడా జీర్ణించుకోలేకపోయారు.

జూనియర్ ఎన్టీఆర్ తల్లి మరియు హరికృష్ణ రెండో భార్య ముస్లిం అని చాలా మంది అనుకునే వారట.. కాని ఆమె బ్రాహ్మిణ్ అని ఓ సారి హరికృష్ణ ఇంట్లో జరిగే వేడుకకు తన రెండో భార్యని అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ని తీసుకొని వేడుకకు వెళ్లాడట హరికృష్ణ గేటు దగ్గర అతిథులని ఆహ్వానిస్తున్న సీనియర్ ఎన్టీఆర్ ఎవరిని పడితే వాళ్లని తీసుకొస్తావు అని హరికృష్ణపై ఫైర్ కావడంతో ఇంటి దగ్గర దించి వచ్చేసాడట హరికృష్ణ. ఆ సమయంలో ఎన్టీఆర్ చాలా చిన్నపిల్లాడిలా ఉన్నాడని తెలుస్తుంది.

ఎన్టీఆర్ ఒక్కో సినిమాతో టాప్ హీరోగా ఎదిగాక ఇప్పుడు అందరు ఆయనను దగ్గరకు తీస్తున్నారట. బాలకృష్ణ కూడా పలు సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన సంగతి అందరికి తెలిసిందే. కాగా, హరికృష్ణ మొదటి భార్య లక్ష్మీ ఆయన క్లాస్‌మేట్ అని తన క్లాస్‌మేట్‌నే ఆయన పెళ్లి చేసుకున్నారట.ఆమెది కూడా నిమ్మకూరేనట. మరో భార్య పేరు షాలిని ఆమె జూనియర్ ఎన్టీఆర్ తల్లి.

హరికృష్ణ శివుడిని ఎక్కువగా ఆరాధించేవాడట . నల్గొండ జిల్లాలోని శివాలయాలకు తరుచూ వెళ్తుండేవారట.. అయితే అతివేగం మరియు సీటు బెల్టు పెట్టుకోకపోవడం, తలకు తీవ్ర గాయాలు కావడం వంటి కారణాలతో ఆయన మృతి చెందారు. హరికృష్ణ టీడీపీ ఆవిర్భావం నుంచి ముఖ్యనేతగా ఉన్నారని ఎన్టీఆర్ చైతన్యరథానికి సారథిగా ఉన్నారాయన వేలు, లక్షల కిలోమీటర్లు బండి నడిపిన అనుభవం ఉంది.

 
1996లో ఎమ్మెల్యేగా గెలిచారు రవాణా శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 2008లో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. హరికృష్ణ మృతి నేపథ్యంలో ఆయనను కడసారి చూసేందుకు ఆయన భార్య షాలిని మరియు జూనియర్ ఎన్టీఆర్ ,సతీమణి లక్ష్మీప్రణతి కూడా హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: