
వావ్:పాన్ ఇండియా మూవీలను దక్కించుకున్న దిగ్గజ ఓటిటి సంస్ధ..!!
తెలుగు సినీ ప్రేక్షకులను అలరించేందుకు zee-5 సంస్థ కొత్త సినిమాలను, కొన్ని వెబ్ సిరీస్ లను డైరెక్టుగా అందులో విడుదల చేసేందుకు తీసుకు వస్తోంది. ఇక కొన్ని సినిమాలను తన బ్యానర్ పై కూడా నిర్మిస్తోంది.. ఇక వాటితో పాటుగా పలు క్రేజీ మూవీలను కూడా కొనుగోలు చేసింది అన్నట్లుగా సమాచారం.. సౌత్ లో zee-5 ఓటిటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ను బలోపేతం చేసేందుకు ఎంతో ఖర్చు చేస్తోంది అన్నట్లుగా వినిపిస్తోంది. అందుకోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా rrr మూవీ సినిమా హక్కులను జి-5 కొనుగోలు చేసింది. ఈ సినిమా అన్ని భాషలలో ఈ సంస్ధ కొనుగోలు చేసింది.
అయితే ఇప్పుడు బాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న RC-15 మూవీని కూడా .ZEE-5 లో స్ట్రీమింగ్ చేసేందుకు ఆ హక్కులను సొంతం చేసుకుంది అన్నట్లుగా బాగా వార్త వినిపిస్తోంది. అందుకోసం ఇతర సంస్థలతో పోటీ పడి మరి ఆ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో ఈ ఓటిటి ఫ్లాట్ ఫామ్ దశ తిరగబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఏ సినిమా అయినా సరే నాన్ థియేట్రికల్ రైట్స్ కేవలం ఈ సంస్థ కే చెందుతాయట.