వెంకటేష్,
వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్
హీరోయిన్ లుగా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న
సినిమా ఎఫ్ త్రీ, ఈ
సినిమా 2019
సంక్రాంతి కానుకగా విడుదలై
బాక్స్ ఆఫీస్ దగ్గర
బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఎఫ్ టు సినిమాకు ఫ్రాంచైజీ గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాను మొదట ఆగస్టులో విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది, కాకపోతే దేశంలో
కరోనా ప్రభావం వల్ల ఈ
సినిమా ఆగస్టులో విడుదల కాలేదు. అయితే ఆ తర్వాత ఈ సినిమాను
ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, అయితే
సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న భీమ్లా
నాయక్ సినిమాను కూడా
ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఈ
సినిమా ఫిబ్రవరి నుండి తప్పుకొని ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఎఫ్ త్రీ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాక విడుదల తేది ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది.
దర్శక ధీరుడు
రాజమౌళి దర్శకత్వం లో మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్,
జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన
ఆర్ఆర్ఆర్ సినిమాను కొన్ని రోజుల క్రితం
సంక్రాంతి కానుకగా
జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, ఈ
సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో ఆ సమయంలో విడుదలయ్యే సినిమాలన్నీ దాదాపుగా వాయిదా పడ్డాయి. ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ దేశంలో
కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమాను వాయిదా వేశారు, ఇదిలా ఉంటే తాజాగా
ఆర్ఆర్ఆర్ సినిమాను
మార్చి 18 వ తేదీన లేదా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. అయితే ఒకవేళ ఏప్రిల్ 28 వ తేదీన
ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేసినట్లు అయితే మరొకసారి కూడా ఎఫ్ త్రీ
సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.