పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,
దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న
సినిమా భీమ్లా
నాయక్, ఈ సినిమాలో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన
నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా,
దగ్గుబాటి రాణా సరసన సంయుక్త
మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది, భీమ్లా
నాయక్ సినిమా మలయాళ సూపర్ హిట్
మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది, ఇదిలా ఉంటే ఇప్పటికే భీమ్లా
నాయక్ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను ఈ సంవత్సరం
సంక్రాంతి కానుకగా
జనవరి 12 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం తెలియజేసింది, అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను
సంక్రాంతి బరి నుండి తప్పించి
ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది, ఈ
మూవీ షూటింగ్ దశలోనే ఆగిపోయింది, టాకీపార్ట్కు సంబంధించిన కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉండగా ఈ నెల 25 నుంచి చిత్రీకరణ జరిపేందుకు చిత్ర బృందం షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై
సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు, ఈ సినిమాకు
తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు, ఇప్పటికే
తమన్ సంగీతం సమకూర్చిన ఈ
సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.