నాచురల్ స్టార్ అయిన
నాని తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులతో డీలా పడిన
శ్యామ్ సింగరాయ్ సినిమాతో ఎట్టకేలకు విజయంను సొంతం చేసుకున్నారు.నాని హీరోగా
శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో
దసరా అనే
సినిమా తెరకెక్కుతోందట.. ఈ సినిమాలో
నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం.సాధారణంగా హీరోలు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించడానికి అస్సలు ఇష్టపడరు.
ఈ సినిమాలో నానికి జోడీగా
కీర్తి సురేష్ నటిస్తుండగా బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ
మూవీ తెరకెక్కుతోందట.సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారని తెలుస్తుంది..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఈ
సినిమా షూటింగ్ ఆగిందట.. జెంటిల్ మేన్,
వి సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి
నాని మెప్పించిన సంగతి అందరికి తెలిసిందే... ఈ సినిమాలలో జెంటిల్ మేన్ హిట్ గా నిలిస్తే
వి మాత్రం ఫ్లాప్ గా నిలిచిందని తెలుస్తుంది
అయితే
నాని మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని తెలిసి ఈ పాత్ర అంటే నానికి అంత ఇష్టమా అంటూ నెటిజన్లు బాగా కామెంట్లు చేస్తున్నారు.
సత్యన్ సూర్యన్ ఈ సినిమాకు కెమెరా హ్యాండిల్ చేస్తున్నారట.ఈ ఏడాదే ఈ
సినిమా రిలీజ్ కానుందని
నాని ఈ సినిమాతో పాటు అంటే సుందరానికి సినిమాలో కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.వరుసగా సినిమాలలో నటిస్తూ
నాని కెరీర్ ను ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలను
నాని విడుదల చేస్తున్నారట.నాని ఎక్కువగా పక్కింటి అబ్బాయి తరహా పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఉండటంతో వేగంగా సినిమాలు చేస్తున్నారని తెలుస్తోంది.. ఒక్కో సినిమాకు
నాని పది కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.నవ్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ ఉండటంతో నానికి విజయాలు దక్కుతున్నాయని ప్రేక్షకుల్లో నానికి సినిమాసినిమాకు ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ పెరుగుతోందట.