సుకుమార్ : అతడు సెల్ఫిష్..అతడి కథ స్టైలిష్.. ఎప్పుడంటే?

RATNA KISHORE
కొన్ని సినిమాలు హండ్రెడ్ ప‌ర్సంట్ ల‌వ్ అన్నంత స‌క్సెస్ అవుతాయి.కొన్ని డ‌ల్ అయిపోతాయి.కొన్నిజ‌గ‌డం సినిమాకు వ‌చ్చినంత క్రేజ్ తెచ్చుకుంటాయి.కొన్ని ఒన్ సినిమా మాదిరి ఆలోచింప‌జేస్తాయి.కొన్నిజిస్మ్ త‌ర‌హాలో కుమారీ 21ఎఫ్ అంటాయి..ఇప్పుడు పుష్ప ద రైజ్ త‌రువాత పుష్ప ద రూల్..ఇలా ఆర్య నుంచి ఆర్య 2 వ‌ర‌కు, పుష్ప నుంచి పుష్ప 2 వ‌ర‌కు ఆయ‌న ఆలోచ‌న‌లే భిన్నం.నాన్న‌కు ప్రేమ‌తో అని రాసి సినిమా సినిమాకు కృత‌జ్ఞ‌త చెప్పే వ్య‌క్తిత్వం ఒక్క ఆయ‌న‌కే సొంతం.ద‌టీజ్ సుక్కూ...ఏదేమ‌యినా ఆయ‌న ఫ్రాయిడ్ ను విప‌రీతంగా ప్రేమిస్తాడు. నండూరి ఎంకి ప్రేమ‌లోఉంటాడు..ఆ త‌ర‌హాలో పాట‌లు రాయిస్తాడు..పావ‌న గోదావ‌రిని పూర్తి స్థాయిలో చూపించ‌లేక‌పోయానే అన్న బాధ నుంచి ఎప్పుడు ఒడ్డెక్కుతాడో మ‌రి! ఇదొక్క‌టి ఆయ‌న వెలితి..ఇదివ‌ర‌క‌టి వెలితి..ఇప్పుడు ఆయ‌న అసంతృప్తి ర‌చ‌నా ప‌రంగా మంచి నాణ్య‌త ఇవ్వ‌లేక‌పోతున్నాననే! ఆ బాధ‌నో,అసంతృప్తినో వెలివేస్తూ తీస్తున్నాడొక మూవీ.. అదే త‌న శిష్యుడు కాశీతో సెల్ఫిష్..పూర్తిగా త‌న‌దైన రైటింగ్ స్టైల్తో..! స్ట్రెన్త్‌తో !

ఆర్య నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అత‌డు సమ్ థింగ్ స్పెష‌ల్..సినిమా సినిమాకు ఎదిగే కెర‌టం.ఆలోచ‌న స‌ముద్రం అని రాసుకోవ‌డం చాలా అల‌వాట‌యిన ప‌దం.అందుకు త‌గ్గ అర్హ‌త‌లో సుక్కు కొంత సాధించాడు.ఇంకొంత సాధించ‌గ‌ల‌డు.ఫ్రాయిడ్ ను న‌మ్ముకుని కొన్ని సినిమాలు తీశాడు.కొంత పల్లె నేప‌థ్య క‌థ‌లు రాసుకుని ఇప్పుడిప్పుడే వీటికీ ఓ క‌మ‌ర్షియ‌ల్ లుక్ ఇస్తున్నాడు.హింట్ ఇస్తున్నాడు.హిట్ ఇస్తున్నాడు కూడా! కానీ సుక్కూ రాయాల్సినంత రాయ‌డం లేదు. చేయాల్సినంత చేయ‌డం లేదు అన్న వాద‌న సినిమా విష‌యంలో ఉంది. అందుకు ఇదివ‌ర‌కు వ‌చ్చిన సినిమాలే ఉదాహ‌ర‌ణ‌లు.

కొన్ని వంక‌ర సినిమాలు ఉన్నాయి.వాటి కార‌ణంగానే ఆయ‌న‌కు పేరు కూడా రాలేదు.రంగ స్థ‌లం క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ కానీ స్టోరీ పరంగాపెద్ద‌గా ఏం లేని సినిమానే!అదేవిధంగా అత‌డు తీసిన పుష్ప కూడా ఇదే కోవ‌! ఇవేవీ గొప్ప సినిమాలు కావు కానీ ప‌ర్లేదు. ఆ మ‌ధ్య త‌న స్టూడెంట్ తో మ‌రో సినిమా తీశాడు గుర్తుందా.. ఆ సినిమా పేరు సూర్య ప్ర‌తాప్ ప‌ల‌నాటి..ఆ సినిమాకు స్క్రిప్ట్ సుక్కూనే రాశారు.ఇప్పుడీ ద‌ర్శ‌కుడితోనే 18 పేజెస్ అన్న సినిమా చేస్తున్నాడు. ఆ మాట‌కు వ‌స్తే ఉప్పెన సినిమా వెనుక ఉన్న‌ది కూడా సుక్కూనే.
 ఇవే కాకుండా మ‌రికొన్ని సినిమాలు కూడా సుక్కూ నుంచి రానున్నాయి. త్వ‌ర‌లో ఆయ‌న మ‌రో శిష్యుడు కాశీ డైరెక్ట‌ర్ గా ఇంట్ర‌డ్యూస్ కానున్నాడు.ఈ సినిమాకు రైటింగ్ పోర్ష‌న్ మొత్తం సుక్కూనే చేస్తున్నాడు.దిల్ రాజు తో  క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.దిల్ రాజు కొడుకు ఆశిష్ రెడ్డి హీరో..ఆయ‌న‌కు ఇది రెండో చిత్రం. వైష్ణ‌వ్ తేజ్ కు మొద‌టి సినిమా బ్రేక్ ఇచ్చాడు.. అల్లూ అర్జున్ కు రెండో సినిమా బ్రేక్ ఇచ్చాడు. రాజ్ త‌రుణ్ కు కూడా ఆయ‌నే బ్రేక్ ఇచ్చాడు. ఈ కోవ‌లో జ‌గ‌డం సినిమా రామ్ కూ సుక్కూ త‌న రెండో సినిమాతో ఆయ‌న కెరియ‌ర్ కు బ్రేక్ ఇచ్చాడు. ఇలా ఎంద‌రెంద‌రో! ఇప్పుడీ హ‌వాలో ఆశిష్, కాశీ సిద్ధం కానున్నారు త‌మ‌ని తాము నిరూపించుకునేందుకు.అండ్ ద టైటిల్ ఈజ్ సెల్ఫిష్ ....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: