అందాల ముద్దుగుమ్మ మెహరీన్, నాచురల్ స్టార్
నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో పాటు మెహరీన్ నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ ముద్దుగుమ్మకు మొదటి సినిమాతోనే
టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కింది. ఇలా
కృష్ణ గాడి వీర
ప్రేమ గాధ సినిమాతో
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత
టాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి
హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ
సంతోష్ శోభన్ హీరోగా
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది, ప్రస్తుతం మెహరిన్, వెంకటేష్,
వరుణ్ తేజ్ హీరోలుగా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, అలాగే తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా మెహరీన్ కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం మెహరీన్ కు సంబంధించిన ఈ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.