సాయం చేసుకుంటున్న హీరోలు..!

NAGARJUNA NAKKA
బాలకృష్ణ సినిమా పరిశ్రమలో యూనిటీ ఉండాలని, సమస్యల పరిష్కారానికి కలిసి కట్టుగా పనిచేయాలని  పిలుపునిచ్చారు. అయితే చర్చల్లో యూనిటీ రావడానికి ఎంత సమయం తీసుకుంటారో తెలియదు గానీ, ప్రమోషన్స్‌లో మాత్రం ఒకరికొకరు సాయంగా నిలుస్తున్నారు. ఒక ఫ్యామిలీ హీరోని మరో ఫ్యామిలీ హీరో ప్రమోట్‌ చేస్తున్నాడు.
మహేశ్‌ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కొడుకు గల్లా అశోక్‌ 'హీరో' సినిమాతో కెరీర్‌ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అయితే కృష్ణ మనవడు, మహేశ్ మేనల్లుడు అనే బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తోన్న అశోక్‌ని సొంత ఫ్యామిలీ మెంబర్స్‌ ముందుండి ప్రమోట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే మహేశ్‌ బాబు ఇటీవలే కరోనా బారిన పడ్డాడు. ఐసోలేషన్‌లో ఉన్నాడు. కృష్ణ పెద్దకొడుకు రమేశ్‌ బాబు ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు. కృష్ణ ఫ్యామిలీ ఈ విషాదం నుంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అశోక్‌ గల్లాని ప్రమోట్‌ చేయాలి.  అభిమానులకి చేరువ చేయాల్సిన అవసరముంది. అయితే అశోక్‌ 'హీరో'ని ప్రమోట్ చేసేందుకు కొణిదెల ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్‌ వచ్చాడు.  'హీరో' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి రామ్‌ చరణ్‌ అటెండ్‌ అయ్యాడు.
మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఫ్యామిలీస్‌ మధ్య మంచి రిలేషన్‌ ఉంది. భరత్‌ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్‌కి జూ.ఎన్టీఆర్ చీఫ్‌ గెస్ట్‌గా వెళ్లాడు. ఆ తర్వాత పార్టీకి తారక్, మహేశ్‌తోపాటు చరణ్‌ కూడా అటెండ్‌ అయ్యాడు. వీళ్లు ముగ్గురు కలిసున్న ఆ ఫోటోలు ఫుల్ వైరల్‌ అయ్యాయి. బాలకృష్ణ 'అఖండ' ఈవెంట్‌కి అల్లు అర్జున్ చీఫ్‌ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు. సో ఈ ప్రమోషన్స్‌లో హీరోల సాకారం చూస్తోంటే టాలీవుడ్‌లో బిగ్ ఫ్యామిలీస్‌ మధ్య గ్యాప్‌ ఉందనే ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని చెప్పొచ్చు. అలాగే అభిమానుల మధ్య కూడా సోషల్‌ మీడియా వార్స్‌ తగ్గే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: