చైతూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ : బ్రేకప్ తో స్ట్రాంగ్.. ఇదేనేమో?

Purushottham Vinay
జోష్ సినిమాతో హీరోగా తన కెరీర్ ను మొదలుపెట్టిన నాగచైతన్య కెరీర్ లో కొన్ని ఎత్తు పల్లాలను చూసి ఒక్కో  హిట్టు అందుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ కి మంచి విలువైన స్టార్ హీరోగా మారాడు. ఇక 'లవ్ స్టోరీ' ఈరోజు విడుదల అయినా 'బంగార్రాజు' సినిమాలు చైతూ ఎంత విలువైన నటుడో మరోసారి నిరూపించాయి. గత సంవత్సరం విడుదలైన లవ్ స్టోరీ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు కూడా భారీ లాభాలను అందించింది. ఇక ఈరోజు విడుదలయిన బంగార్రాజు సినిమాతో నాగ చైతన్య ఖాతాలో మరో మంచి సక్సెస్ ఫుల్ హిట్ చేరింది. ఈ సినిమాకు అన్ని చోట్లా కూడా మంచి రివ్యులు వస్తున్నాయి. ఇక ఈ సంక్రాంతి పండుగకు సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ బంగార్రాజు సినిమా ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాయిస్ కానుంది. ఇక ఈ సంక్రాంతి పండగకి రిలీజైన సినిమాలలో ఇతర సినిమాలతో పోలిస్తే బంగార్రాజు సినిమాకే మంచి టాక్ రావడం అనేది గమనార్హం. ఒకప్పుడు వీక్ స్టోరీస్ ను ఎంపిక చేసుకుని వరుసగా ప్లాప్స్ సినిమాలని చవిచూసిన నాగ చైతన్య ప్రస్తుతం సినిమా సినిమాకు కూడా తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు.
ఇక సమంతతో బ్రేక్ అప్ తరువాత చైతూ కోలుకుంటాడా అని ఫ్యాన్స్ ఎంతో కంగారు పడ్డారు. కానీ బ్రేక్ అప్ తో స్ట్రాంగ్ అవ్వొచ్చని నాగ చైతన్య నిరూపించాడు. ఇక నాగచైతన్య తరువాత సినిమా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా పేరు థాంక్ యూ..అలాగే మళ్ళీ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతన్య హర్రర్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు .ఈ ప్రాజెక్ట్స్ అయిపోయాక పరశురామ్ పెట్ల డైరెక్షన్ లో కూడా నాగ చైతన్య హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. మంచి టాలెంటెడ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ నాగచైతన్య మిడిల్ రేంజ్ హీరోలలో తన రేంజ్ ను మరింత పెంచుకోని ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే..నాగచైతన్య ఇప్పుడు ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నాడు. థాంక్యూ సినిమా కనుక హిట్ అయితే నాగ చైతన్య పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలకు సైతం నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: