దిల్ రాజు ఫ్యామిలీ హీరో 'సెల్ఫిష్'..!

shami
దిల్ రాజు ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కి హీరో పరిచయం అవుతున్నాడు. అతనే ఆశిష్ రెడ్డి. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరో గా రౌడీ బాయ్స్ అంటూ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ను హర్ష డైరెక్ట్ చేశారు. సినిమా లో ఆశిష్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ఆడియెన్స్ దగ్గర నుండి మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇక ఇదిలాఉంటే ఆశిష్ రెడ్డి మొదటి సినిమా ఇలా రిలీజ్ అయ్యిందో లేదో తన నెక్స్ట్ సినిమా న్యూస్ బయటకు వచ్చింది. రౌడీ బాయ్స్ రిలీజ్ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఈ విషయాన్ని చెప్పారు. సుకుమార్ దగ్గర అసిస్టంట్ గా పనిచేసిన కాశి డైరక్షన్ లో ఆశిష్ సెకండ్ సినిమా ఉంటుందని అంటున్నారు. దిల్ రాజు బ్యానర్ లో కూడా కాశీ అసోసియేట్ డైరక్టర్ గా పనిచేశాడు. ఆయన డైరక్షన్ లో ఆశిష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కు టైటిల్ గా సెల్ఫిష్ అని ఫిక్స్ చేశారట. టైటిల్ కాస్త వెరైటీగా ఉంది కదా సినిమా కథ కూడా అలానే ఉంటుందని టాక్.
సెల్ఫిష్ టైటిల్ తో ఆశిష్ రెడ్డి తన సెకండ్ సినిమా చేస్తున్నారు. తప్పకుండా ఆశిష్ తన కెరియర్ లో ప్రేక్షకులను మెప్పించే సినిమాలే లైనప్ చేస్తున్నారు దిల్ రాజు. ముఖ్యంగా అతన్ని యూత్ కి కనెక్ట్ చేసేలా అలాంటి యూత్ కథలనే ఏరి కోరి చేస్తున్నట్టు తెలుస్తుంది. రౌడీ బాయ్స్ తో తెరంగేట్రం చేయగా ఆశిష్ తన సెకండ్ సినిమా సెల్ఫిష్ తో నటుడిగా మార్కులు కొట్టేయాలని చూస్తున్నాడు. ఆశిష్ సెల్ఫిష్ కథా కామీషు ఏంటన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: