ఆచార్య వైపు అడుగులు వేస్తున్న రాజశేఖర్ !

Seetha Sailaja
1990 ప్రాంతాలలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్ ఆతరువాత కాలంలో పూర్తిగా తన ప్రాభవాన్ని కోల్పోయాడు. వరస పరాజయాలతో రాజశేఖర్ మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నది. ఆతరువాత మారిన పరిస్థితులు యంగ్ హీరోల హవా గుర్తించిన రాజశేఖర్ తాను విలన్ పాత్రలకు కూడ రెడీ అన్నసంకేతాలు ఇచ్చినప్పటికీ టాప్ దర్శకులు పట్టించుకోలేదు.

ఇలాంటి పరిస్థితులలో ఇతడు నటించిన ‘గరుడవేగా’ మూవీ హిట్ అయినప్పటికీ అతడికి సరైన అవకాశాలు రాలేదు. దీనితో రాజశేఖర్ భార్య జీవిత మళ్ళీ రంగంలోకి దిగి ‘శేఖర్’ అన్నమూవీని మొదలుపెట్టింది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కావడంతో ఇప్పుడు ఈ మూవీ విడుదలకు రెడీగా ఉంది.

మలయాళంలో 2018లో వచ్చిన ‘జోసెఫ్’ సినిమాకి ఇది రీమేక్. మలయాళంలో జోజు జార్జ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా మళయాళంలో సూపర్ హిట్ రిటైర్మెంట్ తీసుకున్న తరువాత నలుగురు పోలీస్ ఆఫీసర్స్ జీవితంలో జరిగిన ఒక సంఘటన చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్నమాటలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో రాజశేఖర్ సుమారు 60 సంవత్సరాల వ్యక్తిగా చాల డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తాడు. ఈమూవీలో అతడి బాడీ లాంగ్వేజ్ కూడ చాల డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నారు. వాస్తవానికి ఈసినిమాను ఈ సంక్రాంతి రేస్ లో విడుదల చేయాలని భావించారు. అయితే ధియేటర్లు దొరకకపోవడంతో ఇప్పుడు ఈమూవీని ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు. కొనసాగుతున్న కరోనా విలయతాండవం వల్ల భారీ సినిమాలు అన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు అదే బాటలో ఫిబ్రవరి 4న విడుదల కావలసి ఉన్న ‘ఆచార్య’ కూడ ఉంటుంది అంటున్నారు. దీనితో ‘ఆచార్య’ రిలీజ్ డేట్ ‘శేఖర్’ కు వెళుతుంది అంటున్నారు. చిరంజీవి రాజశేఖర్ ల మధ్య సాన్నిహిత్యం అంతంత మాత్రమే అయినప్పటికీ చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ రాజశేఖర్ కు వచ్చింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: