ఛార్మి... జీవితం ఒక గులాబీ లాంటిది..
కాగా ఇదంతా ఆమె ప్రెఫెషనల్ లైఫ్ అయితే ఇపుడు ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ లలో పలువురు నటులు డ్రగ్స్ కేసులో చిక్కుకోగా... ఛార్మి కూడా అందులో ఒకరు. అయితే ఇక్కడ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఛార్మితో పాటుగా ఈ కేసులో చిక్కుకున్నారు మరియు అందులో భాగంగా ఈ డి విచారణలకు హాజరయ్యారు. ఇక ఆమె వివాహానికి సంబంధించి పలు వార్తలు షికార్లు చేశాయి. ఈ ముప్పై నాలుగేళ్ల అందాల రాసి పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తుంటే.. ఛార్మి మాత్రం అందుకు ససేమిరా అనేశారు. తన కెరియర్ మొదట్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో ఛార్మి ప్రేమలో ఉందని వీరికి వివాహం కూడా జరిగిపోయిందని వార్తలు హోరెత్తగా వీరికి పెళ్లి కాలేదని క్లారిటీ వచ్చేసింది.
ఆ తర్వాత దర్శకుడు పూరి తో నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టగా... ఆయనతో రిలేషన్ లో ఉందన్న వార్తలు షికార్లు చేశాయి. కానీ వీరిరువురు కూడా వాటిని కొట్టిపారేశారు. అనంతరం హీరోయిన్ ఛార్మి తన బంధువును పెళ్లి చేసుకోబుతుంది అని వార్తలు వినిపించగా అందుకు స్పందించిన చారు పెళ్లి అనే తప్పును నేను జీవితంలో చేయను అని కుండబద్దలు కొట్టేసింది. మరి ఈ లడ్డు లాంటి మనసున్న అమ్మాయి మనసును మార్చి పెళ్లి చేసుకునే రాజకుమారుడు వస్తాడేమో చూడాలి. అయితే ఛార్మి చూడడానికి ఒక గులాబీ లాగా బయటకు అందంగా అందరితో సంతోషంగా ఉంటుంది. కానీ గులాబీకి ముళ్ళు ఎలా అయితే ఉంటాయో, అదే విధంగా బాధలు కూడా తనను లోలోపల వేధిస్తూనే ఉంటాయి.