అనసూయ భర్త ఏం చేస్తుంటాడో తెలుసా.. అసలు విషయం చెప్పిన యాంకర్?
ఇక ముఖ్యంగా సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్రలో నటించిన అనసూయ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దగ్గర అయ్యింది. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో లేడి విలన్ పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఇలా ఎన్నో ఏళ్ల నుంచి యాంకర్గా ఇటీవలే నటిగా అనసూయను చూస్తున్న ప్రేక్షకులకు దాదాపు గురించి అన్ని విషయాలు తెలుసు. కానీ అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త భరద్వాజ్ గురించి మాత్రం చాలా మందికి కేవలం తక్కువ విషయాలు మాత్రమే తెలుసు.
అనసూయ భర్త ఏం చేస్తుంటాడు అన్న విషయం దాదాపు చాలా మందికి తెలియదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది అనసూయ. తన భర్త ఒక ఫైనాన్షియర్ అంటూ తెలిపింది. అంతేకాకుండా ఫండింగ్ ప్లానర్ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. అయితే తన భర్త తనకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాడు అని. ఎన్ని విమర్శలు వచ్చినా తన భర్త వాటిని పట్టించుకోడు అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. తన భర్త సపోర్ట్ తోనే ఇదంతా సాధించగలుగుతున్నా అంటూ చెప్పుకొచ్చింది ఈ జబర్దస్త్ యాంకర్.