రౌడీ బేబీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన స్టార్ హీరో..

Satvika
ప్రపంచ వ్యాప్థంగా మంచి క్రేజ్ ను అందుకున్న సాంగ్ రౌడీ బేబీ.. ఈ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో తెలియంది కాదు. యుట్యూబ్ తో పాటుగా సోషల్ మీడియాలో కూడా ఒక ఊపు ఊపెసింది.ధనుష్, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా మారీ-2. ఈ సినిమాలోని రౌడీ బేబీ పాట సంగీత ప్రపంచంలో దుమ్ములేపింది. యూట్యూబ్‌లో 100కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డులను బ్రేక్ చేసింది.

ఇన్ని కోట్ల వ్యూస్ సాధించిన తొలి దక్షిణాది సినిమా ఇదే. మారీ-2 సినిమా వెండితెర మీద పరాజయం పాలైంది. కానీ, ఆ పాట మాత్రం భారీ స్థాయిలో విజయం సాధించింది. ఆ సినిమా విడుదలై దాదాపుగా 3 ఏళ్లు కావస్తున్నా రౌడీ బేబీ పాట క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.. అంటే పాటకు ఎంథగా క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లెదు. ఎక్కడ విన్నా కూడా ఇదే పాట వినిపిస్తోంది.. తాజాగా ఈ పాటకు బాలివుడ్ స్టార్ హీరో అదిరిపోయే స్టెప్పులేసి అందరిని ఒకింత ఆశ్చర్యాన్నికి గురి చేశాడు.

తాజాగా బాలీవుడ్ నటుడైన విక్కీ కౌశల్ ఆ పాటకు డ్యాన్స్ చేశారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రాం లో పోస్ట్ చేశారు. ఆ వీడియో కింద క్యాప్షన్ కూడా రాశారు. విక్కీ స్టెప్పులకు అభిమానులందరు ఫిదా అయ్యారు. నెట్టింట షేర్ చేయడం మొదలుపెట్టారు. ఆ వీడియో కింద అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. '' అఫ్టర్ మ్యారేజ్ '' అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ''కత్రినా వదిన ఎక్కడ'' అని మరో సోషల్ మీడియా యూజర్ స్పందనను తెలిపారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్‌లో వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఇప్పుడు ఇద్దరు సినిమా లతో బిజీ అయిపోయారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: