వావ్: మొట్టమొదటి టాలీవుడ్ సూపర్ గర్ల్ మూవీ..!

Divya
వెరోనికా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాతగా స్టీఫెన్ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతూ తెరకెక్కబోతోన్న అడ్వెంచర్ మూవీ ఇంద్రాణి.. ఇప్పటివరకూ తెలుగు తెరపై ఎన్నడూ చూడని విధంగా డిఫరెంట్ పాయింట్ని తీసుకొని ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా స్టీఫెన్ రూపొందిస్తున్నారు.. యాక్షన్ సన్నివేశాలకు కమర్షియల్ హంగులు జోడించి ఓ సూపర్ గర్ల్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. తాజాగా ఒక కెప్టెన్ మార్వెల్.. వండర్ ఉమెన్ లాంటి క్యారెక్టర్ తో రంగంలోకి దిగబోతోంది.. లేడీ ఓరియెంటెడ్ సినిమా గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు..

అంతేకాదు ఈ సినిమాలో ప్రధాన భూమిక పోషిస్తున్న హీరోయిన్కి సూపర్ పవర్ ఉంటుందట.. ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకు ఈ సినిమాలో మంచి స్కోప్ ఉంటుంది అని దర్శక నిర్మాతలు తెలిపారు.. అంతే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని కథను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అని సమాచారం.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు స్టీఫెన్.. న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు స్క్రిప్టుపై కసరత్తులు చేసి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి దానిని చాలా గ్రాండ్ గా వీ ఎఫ్ ఎక్స్  వర్క్ లో ఎలా జరగాలి అనే దాని పై ట్రైనింగ్ తీసుకున్నారట.

అంతేకాదు ఇండియా లో మరో మూడు నెలల పాటు రీసెర్చ్ చేసి మంచి అవుట్ పుట్  లక్ష్యంగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి  ప్రస్తుతం రంగంలోకి దిగుతున్నారు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ నేమ్ రిజిస్టర్ చేసి, ప్రీప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేశారట.. సినిమా షూటింగుకు సంబంధించి షెడ్యూల్స్ పై ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్శకనిర్మాతలు వెల్లడించారు. కొత్త నటీనటులకు ఈ సినిమాలో అవకాశం ఇస్తూ ఉండడం విశేషం.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను వెల్లడిస్తామని నిర్మాత సుమన్ బాబు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: