పవన్ కళ్యాణ్ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్..!

Satvika
పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమా లతో బిజిగా ఉన్నాడు.ఒక్కో సినిమా ఒక్కో విధంగా ఉన్నాయని తెలుస్తుంది.అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. ఎందుకంటే ఈ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచడు అని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. గతం లో భారీ హిట్ ను అందుకున్న  గబ్బర్ సింగ్ ను మించిన కథతో ఇప్పుడు రానున్న సినిమా ఉందని తెలుస్తుంది.



హరీష్ డైరెక్షన్ లో సినిమా అంటే అందరికి భారీ అంచనాలు ఉన్నాయి.. ఇది ఇలా ఉండగా భీమ్లా నాయక్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే హరిహర వీరమల్లు షూటింగ్ ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఆ తర్వాతే భవదీయుడు భగత్ సింగ్ మూవీ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ పవన్ మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.పవన్, దేవిశ్రీ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబోలో జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. 



ఈ సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ఆల్రెడీ మ్యూజిక్ వర్క్ స్టార్ అయ్యింది. రెండు సాంగ్స్ కూడా కంపోజ్ చేశాను. ఈ చిత్రంలోని పాటలు ఎనెర్జిటిక్ గా, మెలోడియస్ గా ఉండబోతున్నాయి అని తెలిపాడు.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ మీదకు వెల్లనుంది. మామూలుగానే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు దేవి చెప్పిన మాటలతో మరింత పెరిగాయని తెలుస్తుంది.. భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. గత ఏడాది ఫస్ట్ లుక్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంతవరకూ ఆగాల్సిందే...



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: